గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు టై బెల్టు ఐడి కార్డ్ వితరణ
గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు టై బెల్టు ఐడి కార్డ్ వితరణ
గొల్లపల్లి నవంబర్28:
మండలంలోని ఇంగ్లీష్ మీడియం లో ఆరో తరగతి నుండి 12వ, తరగతి వరకు ఉన్నతమైన విద్యని అందిస్తున్న గొల్లపెల్లి మాడల్ స్కూల్ కు ఈమధ్య జరిగిన బదిలీలలో నూతన ఉపాధ్యాయ బృందం వచ్చారు. వచ్చి రాగానే ప్రిన్సిపల్ సుంకర రవి ఆధ్వర్యంలో పాఠశాలలో ఉన్న వివిధ సమస్యలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా
ప్రిన్సిపల్ గారి ప్రోత్సాహంతో కామర్స్ అధ్యాపకులు సతీష్ కుమార్ గారు 25000/- రూపాయలతో విద్యార్థులకు టై, బెల్టు, ఐడి కార్డు లను ఉచితంగా అందజేశారు.
సుదూర ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం అభినందనీయమని ప్రిన్సిపల్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుంకరి రవి, తల్లిదండ్రులు కామర్స్ అధ్యాపకులు సతీష్ కుమార్, అభినందించారు.
రాబోయే రోజుల్లో మరి కొంతమంది దాతలతో స్కూలులో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, దానికి తగిన విధంగా దాతలు ప్రోత్సాహం అందించాలని, ప్రిన్సిపల్ సుంకరి రవి కోరారు.