ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూత
రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూత
* గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
* రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజామంటలు) :
ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత టీపీ కులశేఖర్ (53) గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం ఉదయం కనుమూశారు. సోమవారం మద్యాహ్నం పంజాగుట్ట రహదారిపై తీవ్ర అస్వస్థతకు గురైన కులశేఖర్ ను గుర్తు తెలియని వ్యక్తిగా బావించిన పోలీసులు వెంటనే 108 లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ కులశేఖర్ మంగళవారం ఉదయం గాంధీ లో చనిపోయారు. వార్డులో ఆయన్ని కొందరు గుర్తుపట్టి, అతడి బంధువులకు చెప్పడంతో వారు గాంధీకి వచ్చి, పోలీసులకు శవపరీక్ష సందర్బంగా వివరాలు తెలిపారు. ఆయన డెడ్ బాడికి సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి, రాత్రి ఆయన డెడ్ బాడిని బంధువులకు అప్పగించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో కులశేఖర్:
కులశేఖర్ గత కొంత కాలంగా మానసికంగా, శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన మిత్రులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1971 ఆగస్ట్ 15న సింహాచలంలో టీ పీ కులశేఖర్ జన్మించారు. ఆయన తండ్రి టీ పీ రామచంద్ర చార్యులు, తల్లి రంగనాయకమ్మ. కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్న కులశేఖర్ మద్యానికి బానిసై, మానసిక స్థితిని కోల్పోయినట్టుగా సన్నిహితులు చెబుతుంటారు. ప్రముఖ దర్శకులు తేజ, ఆర్పీ పట్నాయక్, కులశేఖర్ కాంబోలో ఎన్నో హిట్ పాటలు రాగా, దాదాపు 100కి పైగా చిత్రాలకు ఆయన పాటలు రాశారు. కులశేఖర్ అంత్యక్రియం నేడు బుధవారం ఉదయం 9 గంటలకు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు ఆయన కజిన్ గోపాల్ తెలిపారు. ఈమేరకు ఆయన సన్నిహితులు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిసింది.
––––––––
–––––––––