గ్రూప్ 3 అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
వికలాంగులు, స్త్రీలకు ఉచితంగా ఆటోలు
On
గ్రూప్ 3 అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
వికలాంగులు, స్త్రీలకు ఉచితంగా ఆటోలు
జగిత్యాల/గొల్లపల్లి నవంబర్ 17:
జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ ఆదివారం గ్రూప్- 3 పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, చిన్న కెనాల్ చౌరస్తా వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్టు టౌన్ సిఐ వేణు గోపాల్ తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆలస్యం అయితే వారిని ఎగ్జామ్స్ సెంటర్స్ కి తొందరగా తీసుకెళ్లడానికి, వికలాంగులు, స్త్రీలకు ఉచితంగా ఆటోలను అందుబాటులో ఉంచామన్నారు.
Tags