శక్తి శాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ ధ్యేయం-ఆర్ఎస్ఎస్ ప్రాంత సహ వ్యవస్థా ప్రముఖ్ తిరుమల్
జగిత్యాల అక్టోబర్ 9 (ప్రజా మంటలు)
శక్తి శాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థా ప్రముఖ గంటా తిరుమల్ జీ అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా విజయదశమి ఉత్సవం బుధవారం పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త గా విచ్చేసిన తిరుమల్ జి మాట్లాడుతూ.....
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి ఈ విజయదశమి ఉత్సవంతో 100 సంవత్సరములు పూర్తి అయిందన్నారు. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ పునర్నిర్మాణమే ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ ను డాక్టర్ హెడ్గేవార్ స్థాపించారని తెలిపారు.
విజయదశమి ఉత్సవం రోజు శక్తి ఉపాసన ముఖ్య ఉద్దేశంగా ఉంటుందన్నారు. వ్యక్తులు కాని, సమాజం కానీ, దేశం గానీ శక్తివంతంగా ఉంటేనే మన మాట చెల్లుబాటు అవుతుందన్నారు. శక్తివంతమైన దేశ నిర్మాణం కోసం ప్రజలు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్పు చేసుకోవాలని సూచించారు. చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ అత్యంత శక్తివంతమైన తీవ్రవాదులను మట్టి కనిపిస్తున్న తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉందన్నారు.
ఇజ్రాయిల్ లోని ప్రతి వ్యక్తి ఒక సైనికుడేనని, ప్రతి వ్యక్తి ఒక దేశభక్తుడేనని అలాంటి దేశానికి ఎంతటి ఆపద వచ్చిన సులభంగా ఎదుర్కొంటుందన్నారు. దేశంలోని ప్రజల్లో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ దేశానికి ఆపద వస్తే ఒకే తాటిపై నిలబడే సంస్కృతిని అలవర్చుకోవాలని సూచించారు. అంతకుముందు స్వయం సేవకులు ఈ గీత విద్యాలయం నుండి బయలుదేరి పట్టణంలోని ప్రధాన వీధుల గండ పథ సంచలనం (రూట్ మార్చ్) భారతీయ వాయిద్యాలతో నిర్వహించిన ఈ పథసంచరం పట్టణ వాసులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్, జిల్లా సంఘచాలక్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, నగర సంఘ చాలక్, జీడిగే పురుషోత్తం జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.