అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

మనస్తాపం చెంది మరణమే శరణ్యం అనుకున్న తీరు హృదయ విచారకర సంఘటన

On
అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 06: ప్రజామంటలు

చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపం చెంది మల్లమారి రవీందర్(52) అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు మల్లమారి రవీందర్ గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. పొద్దుగూకిన ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కలత చెంది వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వెతికారు. అతని ఆచూకీ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తోటి వ్యవసాయదారులు వంగర పోలీసులకు సమాచారం అందించారు. రవీందర్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వీరి చదువుల నిమిత్తం అప్పులు కాగా పండించిన పంట ఆశించినంత మేర దిగుబడి రాలేదు. దీంతో మనస్థాపం చెందిన రవీందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య కవిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు.

Tags