జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ముఖమంత్రికి 35 వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ

On
జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ముఖమంత్రికి 35 వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ

జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ముఖమంత్రికి 35 వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ

జగిత్యాల ఆగస్టు 12:

జగిత్యాల పట్టణంలోని ప్రింట్  & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు. గత పది రోజుల నుండి " నిరసన దీక్ష " చేయడం జరుగుతుంది., గత 30 సం,, ల నుండి ఇంటి స్థలాల కొరకు ప్రతి MLA గార్లకు తెలియచేస్తూ వినతి పత్రాలు ఇస్తూ పోరాటం చేస్తూ వస్తున్నారు. కాని, ఏ ప్రభుత్వం వీరికి ఇంటి స్థలాలు మంజూరి చేయడం లేదు. పాత్రికేయ సోదరులకు ఇంటి స్థలాలు ఇవ్వడం ప్రభుత్వం ఒక్క బాధ్యత. ఎందుకంటే, ప్రభుత్వంకు, ప్రజలకు మద్య ఒక వారధి గా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో పాత్రికేయులే  ప్రముఖ పాత్ర పోషిస్తారు మరియు తెలంగాణ రాష్ట్ర  సాధన లో వీరి పాత్ర చాలా కీలకమైనది రాజ్యాంగంలో పోర్త్ ఫిల్లర్ గా మీడియా ఉంది. రాజ్యాంగానికి ఫోర్ పిల్లర్స్ కూడా ముఖ్యమైనవే. ఇందులో ఒక్కటి పనిచేయక పోయినా రాజ్యాంగం నిలబడలేదు కావున వీళ్ళ ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం కచ్చితంగా ఇంటి స్థలాలు మంజూరు చేయాలని 35 వ వార్డు కౌన్సిలర్  హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కు రాసిన లేఖలో కోరారు.

. జగిత్యాల పట్టణ పరిదిలో చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. SRSP  కి సంబందించిన 4 1/2 ఎకరాల స్థలం ఒక దగ్గర ఉన్నట్లుగా పాత్రికేయ సోదరులు మా దృష్టికి తీసుకొచ్చారు కావున ఆ స్థలాన్ని అయిన మంజూరి చేయగలరని మనవి.జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని మరియు స్థానిక MLA , MLC గార్ల ద్వారా కూడా వివరాలను తెలుసుకొని వెనువెంటనే ఇక్కడ పది రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నా పాత్రికేయ సోదరులు దీక్ష విరమించే విధంగా వెంటనే ఇంటి స్థలాలు మంజూరి చేయాలని  మా జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన 35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ కోరారు.

Tags