జగిత్యాల బస్టాండ్ లో గుర్తు తెలియని మహిళా మృతదేహం
జగిత్యాల బస్టాండ్ లో గుర్తు తెలియని మహిళా మృతదేహం
జగిత్యాల ఆగస్టు 18:
జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ఒక గుర్తు తెలియని మహిళ పడిపోయి ఉన్నది అని సమాచారం రాగా జగిత్యాల పట్టణ ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లి, పరిశీలించి చూడగా, ఆమె చనిపోయి ఉన్నదనీ వివరాలు తెలియాలని పోలీసులు తెలిపారు.
ఆమె వద్ద తనిఖీ చేయగా ఆమె దగ్గర ఉన్న ఒక చిన్న బుక్కులో అడ్రస్ భూక్య లక్ష్మి w/o రామ్లాల్, వయసు 40 సంవత్సరాలు, హౌస్ నంబర్ 2-77, అమ్మక్క పేట, మెట్పల్లి సెల్ నెంబర్ 773185 2013 అని రాసి ఉంది. కానీ ఆ అడ్రస్ లో అడిగితే వారు తెలియదు అని చెబుతున్నారనీ, మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుందనీ పోలీసులు తెలిపారు.
ఈ గుర్తుతెలియని మహిళ పింక్ కలర్ స్వెట్టర్ ధరించి బ్రౌన్ కలర్ సారీ కట్టుకొని ఉన్నది ఎస్ఐ గారు వెంటనే అట్టి మహిళ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చరి గదిలో ఉంచారు.ఈ మహిళ ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే జగిత్యాల పట్టణ పోలీస్ వారికి
8712656815 ఫోన్ ద్వారా తెలుపాలని కోరారు.