ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ –అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం.
- జిల్లా సంక్షేమ అధికారి బి. వాణిశ్రీ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493 / 9348422113)
జగిత్యాల మే 20 (ప్రజా మంటలు) :
జిల్లాలో వివిధ రంగాలలో ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ మరియు ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన 6 నుండి 18 ఏళ్ళ బాలబాలికలకు 2024-25 యేడాది గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి బి. వాణిశ్రీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దరఖాస్తులను 31 జూలై 2024 లోపు ఆన్ లైన్లో http:/awards. gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా మరిన్ని వివరాలకు బాల రక్షా భవన్, బచ్ఫన్ స్కూల్ ప్రక్కన కానీ లేదా జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, రూమ్ నెంబర్ 7, కొత్త కలెక్టర్ కార్యలయం, జగిత్యాల నందు సంప్రదించగలరని ఇతర వివరాలకు 9885497287 నెంబర్ ను సంప్రదించాలన్నారు.