ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ బారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే సంజయ్.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493)
జగిత్యాల మార్చి 26(ప్రజా మంటలు )
పట్టణ రూబీ ఫంక్షన్ హాల్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బిఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు మరియు దావత్ కార్యక్రమంలో పాల్గొన్న బి అర్ ఎస్ నిజామాబాద్ ఎంపి అభ్యర్థి బాజి రెడ్డి గోవర్దన్ గారు,స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్.
వారు మాట్లాడుతూ.... రంజాన్ మాసం ముస్లిం సోదరులు పవిత్రంగా,ఉపవాస దీక్ష తో కొనసాగిస్తారని,తెరాస ప్రభుత్వం గతం లో ముస్లిం ల సంక్షేమం కోసం కృషి చేసిందని జగిత్యాల నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో మస్జీద్,శదీఖాన,అశురఖాన,ఖబరస్తాన్ ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయినవని తెలిపారు.మైనారిటీ లకు తెరాస ప్రభుత్వ హయాంలో మైనారిటీ ఓవర్సీస్ విద్య కోసం 20 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చిందని గుర్తు చేశారు,మజీద్ లో పని చేసే ఇమామ్, మౌజన్ లకు పింఛన్ అందజేశామని ,ముస్లిం సోదరులకు రంజాన్ మాసం పురస్కరించుకొని పేదలకు ఉచితంగా బట్టలు,విందు ఏర్పాటు చేశామని, మైనార్టీ రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్తి పై ఒక లక్ష రూపాయలు వరకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమేనని,షాది ముబారక్ ద్వారా 100116/- అందజేశామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదర భావం తో ఉంటారని,శాంతి భద్రతల పరిరక్షణకు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని,అందువల్లనే రాష్ట్రానికి వేల కోట్లలో విదేశీ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుట్టారని అన్నారు.జగిత్యాల లో ఇఫ్తార్ లో పాల్గొనడం చాలా ఆనందం గా ఉందని,హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా గత తొలి ముఖ్యమంత్రి పని చేశారని,అన్ని పండగలను ప్రభుత్వ పరంగా ఘనంగా జరపడం జరుగిందని గతంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను,పండుగలను నిర్లక్ష్యం చేశారని అన్నారు.
చిన్న గ్రామాలనుండి పట్టణాల వరకు ఆలయాలకు,మజీద్ ఖబరస్టాన్,చర్చి లకు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు,అందరూ భాగుందాలని ఆకాంక్షించారు .
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు,బి అర్ ఎస్ నాయకులు, మైనార్టీనాయకులు,తదితరులు పాల్గొన్నారు.