సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విస్మయం -  2K25 వార్షికోత్సవ వేడుకలు

On
సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విస్మయం -  2K25 వార్షికోత్సవ వేడుకలు

జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)
పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ వారి  విస్మయం - 2025 వార్షికోత్సవ వేడుకలు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ శ్రీమతి మంజుల రమాదేవి  మరియు పాఠశాల డైరెక్టర్లు  బియ్యల హరి చరణ్ రావు  , జగిత్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడు బోయినపల్లి శ్రీధర్ రావు  బాబు జగ్జీవన్ రావు జయంతి నీ పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి ,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ " నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపారు. విద్యార్ధి దశ లోనే కస్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు .యువత వివిధ బాధ్యతాయుతమైన పనులు చేపట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు . ప్రతి విద్యార్థి తాను అనుకున్న ఆశయాలు సాధించి ఆదర్శంగా ఉండాలని సెల్ఫోన్లకు ,  ఇతర వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని అని అన్నారు . ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన టెక్నాలజీ పరంగా విషయాలను తెలుసుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. 


విద్యార్థులకు క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలు,  చాలా అవసరమని మరియు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల నృత్యాలు నాటికలు ప్రేక్షకులను అల్లరించాయి. ఛత్రపతి శివాజీ నాటిక  ప్రత్యేకంగా ఆకట్టుకున్నది .ఇతిహాసాల గురించి తెలిపే వేంకటేశ్వర కళ్యాణం ,  నవ శక్తీ అమ్మ వార్లు, దేశభక్తిని కలిగించే విధంగా ఆర్మీ సాంగ్, పల్లె వాతావరణన్ని, ప్రకృతిని రైతుల గొప్పతనన్ని తెలిపే సాంగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ మరియు తండ్రి కొడుకుల అనుబంధం పైన చేసిన  నృత్యాలు చూపరులను ఆలోచింప చేశాయి. తల్లి తండ్రులు వారి పిల్లల తో (ఫ్యామిలీ డాన్స్) చేసిన నృత్యం ప్రేక్షకులకు కనువిందు చేసింది. మహిళల కష్టాలు వారి అభ్యున్నతి గురించి చేసిన నాటిక చూపరులను కంటతడి పెట్టించింది .

ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, , మంజుల రమాదేవి ,మౌనిక రావు, రజిత , అజిత , సుమన్ రావు , ఉపాద్యాయ బృందం ,తల్లి తండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

జైశ్రీరామ్ నినాదాలతో చిన్నారి

జైశ్రీరామ్ నినాదాలతో చిన్నారి భీమదేవరపల్లి (ప్రజామంటలు) ఏప్రిల్ 7 : శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణం అనంతరం సీతారాముల శోభాయాత్రలో ముల్కనూర్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి కాషాయ జెండా ఎత్తి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం పలువురిని ఆకర్షించింది. కాగా ముల్కనూరు హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ఊరేగింపు జరిగింది. ఉత్సవమూర్తుల ఊరేగింపులో భక్తజనం భారీ...
Read More...
Local News 

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ 

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ  జగిత్యాల ఏప్రిల్ 6(ప్రజా మంటలు  )బి జె పి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  కమల నిలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.  బోగ శ్రావణి* ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...  శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు 1952లో భారతీయ జన సంఘం గా స్థాపించబడిన గౌరవనీయులు...
Read More...
Local News 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు బుడి అరుణ్ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ తదితరులు నిర్వహించారు....
Read More...
Local News 

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగాయి ఆలయ చైర్మన్ బొమ్మన కుమార్- మాధవి దంపతులు, ఉపాధ్యాయులు కందుకూరి మధుకర్ రెడ్డి, దంపతుల చేత కళ్యాణం నిర్వహించారు మాజీ సర్పంచ్ రెవెళ్ల సుజాత లింగయ్య, సత్యనారాయణ కరుణశ్రీ  దంపతులు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో రిటైర్...
Read More...
Local News 

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర భీమదేవరపల్లి మార్చ్ 7 (ప్రజామంటలు)  :   శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి శోభాయాత్ర ముల్కనూర్ లో శ్రీ సాంబమూర్తి దేవాలయం నుండి బస్టాండ్ వరకు కన్నుల పండువగా కొనసాగుతుంది. ముల్కనూర్ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. జైశ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. యువత కాషాయ జెండాలు పట్టుకొని జైశ్రీరామ్ నినాదాలతో హోరోత్తించారు. శోభాయాత్రలో భక్తులు
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం ( రామ కిష్టయ్య సంగన భట్ల  9440595494) రామ కల్యాణోత్సవ వేడుకలు వైభవో పేతంగా, కన్నుల పండువగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన వెలసిన శ్రీరామాలయంలో ఉదయం శ్రీరామ జన్మో త్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బలరామ శర్మ, బాలచంద్రశర్మ, రఘునాథ శర్మ, మోహన్ శర్మ,...
Read More...
Local News 

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం భారీగా తరలివచ్చిన భక్తులు గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో   శ్రీకళ్యాణ రామచంద్ర ఆలయ ప్రాంగణంలో  రాములోరి  శ్రీరామ నవమి వేడుకలు ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య -సువర్ణ  అర్చకులు తిరుణారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు మధ్య శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు కళ్యాణ రామచంద్రస్వామికి.అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల...
Read More...
Local News 

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు. జగిత్యాల ఎప్రిల్ 6 : తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్, ,పెన్షనర్స్  అసోసియేషన్ల  జగిత్యాల జిల్లా  శాఖల  ఆధ్వర్యంలో  ఆ సంఘాల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జన్మదినోత్సవం  సందర్భంగా  వయోవృద్ధుల రక్షణ,పోషణ సంక్షేమ చట్టం పై   సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,సఖి , భరోసా,మహిళా  చట్టాలపై  రిటైర్డ్ జాయింట్...
Read More...
National  Filmi News 

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్ అత్యధిక వసూళ్లు సాధించిన L 2- ఎంపురాన్ చిత్రం హైదరాబాద్ ఎప్రిల్ 05:  మోహన్ లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ ఆల్ టైమ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది.ఇప్పుడు మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్. ఈ క్షణం...
Read More...
Local News 

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం. స్వామి వారి ఉత్సవ ముర్తుల ఉరేగింపు.అలయకమిటీ అధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం.   సీతారాముల వారికి ఓడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు. ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కమనీయం రమణీయంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో శ్రీసితరామలక్ష్మణ బలంజనేయస్వామి,ఎర్దండీ లో నుతనంగా నిర్మించిన అలయకమిటీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం   సికింద్రాబాద్, ఏప్రిల్ 6 (ప్రజామంటలు)::   సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఆదం సంతోష్ కుమార్ సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన శ్రీ సీతారామ కళ్యాణ వేడుకల్లో
Read More...
Local News 

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం సికింద్రాబాద్, ఏప్రిల్ 6 (ప్రజా మంటలు):   గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుత కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి  నందకుమార్ రెడ్డి వైద్యరంగం కు చేసిన సేవలు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ అలుమ్ని  అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అయన్ని ఘనంగా సత్కరించింది. గాంధీ మెడికల్...
Read More...