ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

On
ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

( రామ కిష్టయ్య సంగన భట్లIMG-20250406-WA0017
 9440595494)

రామ కల్యాణోత్సవ వేడుకలు వైభవో పేతంగా, కన్నుల పండువగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన వెలసిన శ్రీరామాలయంలో ఉదయం శ్రీరామ జన్మో త్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బలరామ శర్మ, బాలచంద్రశర్మ, రఘునాథ శర్మ, మోహన్ శర్మ, 

 వామనశర్మ, రామశర్మ, శరచ్చంద్ర శర్మ, ఆశ్రిత్ శర్మ, విలోక్ శర్మ, భరత్ శర్మల ఆధ్వర్యంలో విధివిధాన వేదోక్త సంప్ర దాయ పూజలొనరించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వస్తి పుణ్యాహ వాచనం, వామదేవ శతానంద రుత్విగ్వరణం, కళ్యాణార్థం వివాహ వేదిక ప్రవేశం, శ్రీరామచంద్ర వరునికై కన్యా న్వేషణ, సీతారామ వంశావళి ప్రవరలు, మధుపర్క ప్రాశనం, సముహూర్త, మంగళ సూత్ర ధారణం, అక్ష తారోపణం, వివాహానంతర లఘు పూజ, నైవేద్యం, మహామంత్ర పుష్పం, దేవతాశీర్వచనం తదితర ప్రత్యేక కార్య క్రమాలను నిర్వహించారు. సర్వాలంకార శోభితులై, పుష్ప మాలాలంకృతు లైన శ్రీరామచంద్రునికి, పరమపావని యైన లోకమాత సీతాదేవికి లోకకల్యా కల్యాణార్ధం అభిజిత్ లగ్న శుభ ముహూ ర్తంలో మధ్యాహ్నం మూల విరాట్టులకు జరిపించిన కల్యాణ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా గాంచి తరించారు. రామాలయంలో వేదవిదులు మధు శంకర శర్మ, బల్యపెల్లి ప్రసాద్ శర్మ, సంగన భట్ల నర్సయ్య శర్మ, 
పనతుల వెంకట రమణ శర్మ, మధు మహాదేవ్ శర్మ, ఒజ్జల వేంకట రమణ శర్మ, కషోజ్జల రాజేష్ శర్మ, ఇందారపు లక్ష్మీ కాంత్ శర్మ, రాంకిషన్ శర్మ, పెండ్యాల బాలకృష్ణ శర్మ, బొజ్జా ఉమాకాంత్, కొరిడే శంకర్, కాకేరి గోపాల్, 
కాసర్ల వేంకట రమణ శర్మ,  భరత్ శర్మ, ప్రసాద్ శర్మ, పాలేపు దత్తాత్రి, సంగన భట్ల నర్సయ్య, సురేందర్, గొల్లపెల్లి గుండయ్య 
తదితరులు కల్యాణోత్సవాన్ని జరిపించారు.

పట్టు వస్త్రాల సమర్పణ

ధర్మపురి దేవస్థానం పక్షాన ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరముకూడ అందజేయటం జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి అద్యక్షులు జక్కు రవీందర్, ధర్మకర్తలు బాదినేని వెంకటేష్,  బొల్లారం పోచయ్య, గుడ్ల రవీందర్,  కొమురెల్లి పవన్ కుమార్,  మందుల మల్లేష్, నేదునూరి శ్రీధర్, రాపర్తి సాయికిరణ్, స్తంభంకాడి గణేష్, సంబెట తిరుపతి, ఒజ్జల సౌజన్య నరేందర్, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు ,   సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ 
 పాల్గొన్నారు.   

లక్ష్మీ నరసింహ కాలనీలో

ధర్మపురి పట్ట ణంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కాల నీలో నిర్మితమైన శ్రీరామాలయంలో  వేద పండితులు కాసర్ల వంశీ కృష్ణ, కషోజ్జల బాలకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ వోడ్నాల తిరుపతి నేతృత్వంలో ఉదయం నుండి వేదోక్త స్మార్త సంప్రదాయరీతిలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామునికి, సీతాదేవికి లోకకల్యాణార్థం జరిపించిన కల్యాణ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా చూసి తరించారు. 

దేవస్థానంలో..

ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సీతారామ, లక్ష్మీ నరసింహ స్వాముల కల్యాణ వేడు కలు  ఒకే వేదికపై ఒకే మహూర్తాన కన్నుల పండువగా జరిగాయి.
 దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్,  ధర్మకర్తల మండలి సభ్యులు ఏదులాపురం మహేందర్, బాదినేని వెంకటేష్, బొల్లారపు పోచయ్య, గుడ్ల రవీందర్, కొమురెల్లి పవన్ కుమార్, మందుల మల్లేష్, నేదునూరి శ్రీధర్, రాపర్తి సాయి కిరణ్, స్తంభంకాడి గణేష్, సంబెట తిరుపతి, ఒజ్జల సౌజన్య నరేందర్ గార్లు వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ,  ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అర్చకులు నంభి అరుణ్ కుమార్, చక్రపాణి కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,   అర్చకులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కల్యాణ మూర్తులను వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో, శేషప్ప కళా వేదికపైకి తీసుకొచ్చి, శోడశోపచార సహిత పూజలతో, సాంప్రదాయ బద్దంగా కల్యాణం జరిపించారు. 

 తిమ్మాపూర్ లో

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో రామ జన్మ, కళ్యాణ వేడుకలకలను బ్రహ్మోత్సవాలలో బాగంగా నిర్వహించారు. అర్చకులు నేరెళ్ళ వంశీకృష్ణ, మోహన్,  బొజ్జా రాజ గోపాల్ శర్మ,  కళ్యాణం జరిపించారు. 


 మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయులు నర్సింగ్ రావు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే జైనా, దొంతాపూర్, గండి హన్మాన్ ఆలయాల్లో సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించారు 

సాయి జన్మ దిన వేడుకలు

ధర్మపురి క్షేత్రస్థ గోదావరీ నదీ తీరస్థ శ్రీసాయి బాలాజీ మందిరంలో  సాయిబాబా జన్మదిన వేడుకలు వైభ వంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక నిర్మాత ఒజ్జల ప్రవీణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో, ట్రస్టు అధ్యక్షుడు గోలి రాంప్రసాద్ నిర్వహణలో, అర్చకులు, స్థానిక వేద పండితులు ఆకర్ష్ శర్మ, అక్షయ్ శర్మలు, ప్రత్యేక పూజలు, జన్మదిన అర్చనలు నిర్వహించారు. మహా క్షీరాభిషేక కార్యక్రమంలో అశేష భక్తజనులు స్వహస్తాలతో, సాయినాథున్ని క్షీరాభిషిక్తుడిని చేసి తరించారు. ఈ సందర్భంగా నివేదనలు సమర్పించారు.

Tags

More News...

Local News 

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

ఇబ్రహీం పట్నంలో  జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు. ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్ ): ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మరియు ఇబ్రహీంపట్నం పశు వైద్యాశాలలను జిల్లా పశువైద్యాధికారి డా, వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన  గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల...
Read More...
Local News 

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ మెట్టుపల్లి ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకి చెందిన న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు మంగళవారం విధుల్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వృత్తి రీత్య తమ పని తాము...
Read More...
Local News 

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్    బగ్గారం ఏప్రిల్ 08 (ప్రజా మంటలు): బుగ్గారం మండలం గంగాపూర్ లో మంగళవారం సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల్ని ఆడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసి తీరుతామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. తహసీల్దార్...
Read More...
Local News 

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు   ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం మండలం అమ్మకాపేట గ్రామo లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అమ్మకాపేట గ్రామ శాఖ ఈ...
Read More...
Local News 

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి  ఎప్రిల్ 08 (ప్రజామంటలు): గొల్లపెల్లి మండలం  కేంద్రంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం  కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 23ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొనగా ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్లబండ పోటీలను తిలకించేందుకు మండలం నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల మండలాల...
Read More...
Local News 

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత గొల్లపల్లి ఎప్రిల్ 08 (ప్రజా మంటలు) : గొల్లపెల్లి మండలo ఇబ్రహీంనగర్ సెక్టార్ లోని బొంకూరు ఇబ్రహీం నగర్, రాపల్లి, వెంగలాపూర్, తిరుమలపూర్ ఇస్రాజ్ పల్లి, రాఘవపట్నం, నందిపల్లి, శంకర్రావుపేట అంగన్వాడి కేంద్రాలలో 1000 రోజుల ప్రాముఖ్యతను గర్భవతులకు బాలింతలకు ఏడు నుంచి రెండు సంవత్సరాల పిల్లల తల్లులకు తెలియజేశారు. గర్భవతి దశ నుండి రెండు...
Read More...
Local News 

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత జగిత్యాల ఏప్రిల్ 8 (ప్రజా మంటలు)శ్రీరామ నవమి శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి తీర్థ ప్రసాదాలు అందజేసిన విద్యానగర్ రామమందిరం ఆలయ అర్చకులు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ అశోక్ రావు EO...
Read More...
Local News 

శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్    జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఎడ్లంగడి రామాలయంకు సంబంధించిన ధర్మకర్తల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం  నిర్వహించారు. విద్యానగర్ రామాలయం ఆవరణలో పూజా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సుప్రియ, కార్య...
Read More...
Local News 

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్    జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)వేసవికాలంలో జగిత్యాల జిల్లా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ కృషి చేస్తుందని జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ ఈ సాలియా నాయక్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని టౌన్2 సెక్షన్ పరిధిలోని విద్యానగర్  రామాలయం ఎదురుగా డిటి ఆర్ 21 కు...
Read More...
Local News 

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో     ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం 

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో     ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 7( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రున కు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి మూలమూర్తికి రాజలాంచనాలతో కిరీటము, భుజకీర్తులు, పాదుకలు, ఖడ్గం...
Read More...
Local News 

జిల్లా నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జిల్లా నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 8(ప్రజా మంటలు)జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ  ఏ ఎం సి...
Read More...
Local News 

తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తున్నారు..

తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తున్నారు.. *జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ దళిత ఎంప్లాయిస్ ఆవేదన*ఉన్నతాధికారులకు ఫిర్యాదు సికింద్రాబాద్ ఏప్రిల్07 (ప్రజామంటలు) : జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ లోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సిబ్బందిని  ఓసంస్థ పేరుతో ఓ వ్యక్తి తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్ఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సోమవారం రాష్ర్ట ప్రభుత్వ  ఉన్నతాధికారులకు వినతిపత్రాలను...
Read More...