అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు.
జగిత్యాల ఏప్రిల్ 6 ( ప్రజా మంటలు)
పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించినారు. మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆసీనులు చేసి అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణాన్ని మధ్యాహ్నం 12.20 ని.లకు. నిర్వహించగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు .
ఈ కళ్యాణాన్ని ఆలయ అర్చకులు రంజితాచారి , రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, పలువురు వేద పండితులు నిర్వహించారు. ఈ కళ్యాణానికి విశేష సంఖ్యలో భక్తులు, ప్రముఖులు పాల్గొని స్వామి అమ్మ వారలను దర్శించుకున్నారు. మహిళలు అమ్మవారికి వోడి బియాన్ని సమర్పించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మ వారలను దర్శించుకున్నారు. శ్రీ సీతారాముల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
అనంతరం భక్తులకు కళ్యాణ అక్షతలను, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని ఆలయ నిర్వాహకులు వితరణ చేశారు.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఈవో సురేందర్, ఆలయ అధ్యక్షులు అశోక్ రావు, కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత
.jpg)
శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం

జిల్లా నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
