సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
బుడగ జంగాల కాలనీలో ఘనంగా గాయత్రి మహాయజ్ఞం.
జగిత్యాల. మార్చి 10(ప్రజా మంటలు) హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడ బుడగ జంగాల ది అని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జగిత్యాల సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సోమవారం బేడ బుడగ జంగాల కాలనీలో గాయత్రి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుడగ జంగాలకు చెందిన కుటుంబాలు పెద్ద ఎత్తున యజ్ఞంలో పాల్గొన్నారు
. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ బేడ బుడగజంగాలు శివ భక్తులని, శివ తత్వాన్ని, రామాయణ, భారత కథలను బుర్రకథ రూపంలో గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంలో బుడగ జంగాల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.
బుడగ జంగాలలోని పేద రికాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని శక్తులు ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడులకు పాల్పడుతున్నాయని,దీంతో వారి అస్తిత్వాన్ని కోల్పోయి సంస్కృతికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి గొప్పదైన హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తమ కాలనీలో ఇంత పెద్ద ఎత్తున గాయత్రి యజ్ఞాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పాల్గొనే విధంగా చేయడం ఎంతో సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వానరాసి మల్లవ్వ తిరుమలయ్య, సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్, కనికరం లచ్చన్న, సంపూర్ణాచారి, భూమారెడ్డి, బొందుకూరి శ్రీనివాస్, సూర్యనారాయణ, పురుషోత్తం, శ్రీనివాస్ గాయత్రి పరివార్ నిర్వాహకులు రామ్ రెడ్డి, వంగల భాస్కరాచారి, నాగభూషణం,
వి హెచ్ పి నాయకులు పద్మాకర్, రాములు, అరుణ్, సంతోష్ వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
