యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల సి ఎం ,ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల మార్చి 10 ( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయటం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
గత ప్రభుత్వంలో పూర్తయిన నర్సింగ్ కళాశాలను ప్రారంభించడానికి కృషి చేయటం జరిగింది.
మెడికల్ కాలేజి నిధుల మంజూరుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ ని వారి కార్యాలయం లో కలిసి నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
రాయికల్ మండలంలో కస్తూర్బా పాఠశాలకు 4 కోట్లతో నూతన భవనం మంజూరు అయిందని అన్నారు.
5 కోట్ల తో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా
టి ఆర్ నగర్ లో ఏర్పాటు చేస్తున్నాం అని పనులు జరుగుతున్నాయి అని అన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ లో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నిదులు మంజూరు చేశారని గుర్తు చేశారు.
న్యూ హై స్కూల్ లో 10 లక్షల తో మౌలిక సదుపాయాలకు జిల్లా కలెక్టర్ నిదులు మంజూరు చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో రెసిడెన్షియల్ పాఠశాలలు బీసీ ఎస్సీ మైనార్టీ అద్దె భవనంలో ఉండగా చాలా ఇబ్బందిగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి అన్ని జిల్లా లో నూతన భవనాలు మంజూరు చేశారని 200 కోట్ల తో జగిత్యాల చల్ గల్ వాలంతరీ కేంద్రం లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బడ్జెట్ సైతం విడుదల చేయటం జరిగింది అని అన్నారు.
జగిత్యాల నియోజకవర్గం లో విద్య అభివృధి కోసం ఎల్లప్పుడూ తన వంతుగా కృషి చేస్తామని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారం తో అభివృద్ధి చేస్తా అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
