బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టిన బన్సీలాల్ పేట అమ్మాయి..
అభినందించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజామంటలు) :
పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి విజయాన్ని అయినా సరే సాధించడం కష్టమేమీ కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్ పేటకు చెందిన సిల్వరి పరమేశ్ కుమార్తె వర్శిత రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ను స్థానిక నాయకులతో కలసి ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. జగద్గిరిగుట్ట లోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వర్షిత ఈ నెల 11 న లాలాపేట లోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా మార్చి నెలలో ఉత్తర ప్రదేశ్ లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కాలేజీ లో చదువుతూ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో అభినందనీయం అన్నారు. జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించి, తెలంగాణ కు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ లో మరింత ఉన్నతంగా రాణించేలా కృషి చేయాలని, అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్షితను అభినందించారు. స్థానిక నాయకులు ఎల్.వెంకటేశన్ రాజు, అరుణ్ గౌడ్, దేశపాక శ్రీనివాస్, కుమార్ యాదవ్, దేవేందర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
