మహిళా సాధికారికతతోనే సమాజ అబివృది:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 8( ప్రజా మంటలు)
* పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభిందనీయం
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళ సాధికారికతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి,విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీస్ సిబ్బందికి ఎస్పి ఘనంగా సన్మానించి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సంధర్బంగా ఎస్పి మాట్లాడుతూ.... మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని దేశంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు వివిధ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారని పేర్కొన్నారు.మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలని, తమ కలల సాకారం కోసం అహర్నిశలూ పాటుపడాలని సూచించారు. పురుషుల కంటే స్త్రీలకు నిబద్ధత ఎక్కువ అని, జిల్లా పోలీసు శాఖలో పలు విభాగాల్లో మహిళ పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని, పోలీసు స్టేషన్ లో రిసెప్షన్ విధులు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, రైటర్ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, గృహ హింస మరియు వైవాహిక వివాదాలలో బాధితులైన మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అనేక రకాల విధులను మహిళా పోలీసు అధికారులు నిర్వహిస్తున్నారని అభినందించారు. మహిళా అధికారులందరూ పోలీసు శాఖలో భాగమై సమాజానికి చేస్తున్న సేవను పేర్కొంటూ, మహిళలు పలు రంగాలలో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, మహిళా అధికారులందరూ ధైర్యంగా ఉండాలని, తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా మహిళా సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎస్పి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బీమ్ రావు ,డిఎస్పి లు రఘు చంధర్ ,రాములు, మహిళా ఎస్.లు గీత, సుప్రియ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, జిల్లా పరిధిలోని వివిధ విభాగాల మహిళ కానిస్టేబుల్లు,హోం గార్డ్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
