కామర్స్ తో ఉజ్వల భవిష్యత్తు.
జగిత్యాల మార్చి 8( ప్రజా మంటలు)
*జగిత్యాల కామర్స్ ఫోరం ఆవిర్భావ సభలో వక్తలు..*
కామర్స్ తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని జగిత్యాల కామర్స్ ఫోరం వ్యవస్థాపకులు శ్రీపాద నరేష్, ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ అన్నారు.. జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో శనివారం వాణిజ్య శాస్త్ర అధ్యాపకులతో కలిసి వారు జగిత్యాల కామర్స్ ఫోరం ను ప్రారంభించారు.. కామర్స్ తో విద్యార్థులకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని కామర్స్ అనేది సేవా రంగం కిందికి వస్తుందని అన్నారు.. సైన్స్ విద్యార్థులకు సైతం కామర్స్ చదవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.. ఇంటర్మీడియట్ స్థాయి నుండే కామర్స్ ను చదవడం ద్వారా కామర్స్ లో మేలుకులను సులభంగా నేర్చుకోవచ్చనీ అన్నారు.. కామర్స్ ను హైస్కూల్ స్థాయి నుండి ఒక సబ్జెక్టుగా ప్రభుత్వం పెట్టాలని వారు కోరారు.. తద్వారా విద్యార్థులకు చిన్నతనం నుండే కామర్స్ పై అవగాహన పెరుగుతుందన్నారు.. కామర్స్ ను హై స్కూల్ స్థాయి నుండి ఒక సబ్జెక్టుగా పెట్టేందుకు త్వరలోనే తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ని కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, రెసిడెన్షియల్ కాలేజిల అధ్యాపకులు, కేజీబీవీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
