పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం  - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

On
పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం  - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం     
లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు - మీ లెక్కలు తీస్తాం -మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తాం 
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

జనగామ ఫిబ్రవరి 13:

అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుండడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. “మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. అందులో అన్నీ రాసుకుంటాం. ఇంతకింత తిరిగి చెల్లిస్తాం. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు. మీ లెక్కలన్నీ తీస్తాం. అన్నింటినీ మేం అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తాం” అని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ వేధింపులకు గులాబీ సైనికులు భయపడబోరని తేల్చిచెప్పారు.

గురువారం నాడు జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డిప్యుటీ సీఎం టీ రాజయ్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. అంతకు ముందు పెంబర్తిలోనూ విలేకరులతో మాట్లాడారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని, పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారని, కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లను పెంచడానికి శాసన సభలో బిల్లు ప్రవేశపెడుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్ చేశారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని, దాన్ని ఆచరణ సాధ్యం అయ్యేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు ఒక్క బిల్లు కాకుండా మూడు వేర్వేరు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా  46 శాతం ఉందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో విద్యా రంగంలో ఆ వర్గానికి 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలని, ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలని సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడుతామని ప్రకటించిందని, ఇది బీసీలందరి విజయమని, ఇది తొలి విజయం మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ అని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు అని అన్నారు. బిల్లును ఆమోదించిన మరుసటినాడే దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని, కానీ జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడలు వేస్తే సహించబోమని, బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్దిచెబుతారని హెచ్చిరంచారు.  

మళ్లీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ 15 రోజుల కాకుండా నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 60 శాతం మంది తమ ఇళ్లకు సర్వే చేసే వారు రాలేదని అంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. ఈ రీత్యా రీ సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని, టోల్ ఫ్రీ నెంబరును విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాలని, ముఖ్యమంత్రి బొమ్మలు కాకుండా బీసీలకు ప్రయోజనం కలిగేలా ప్రచారం చేయాలని సూచన చేశారు.

కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి.. నిధులు పారాయని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం గ్రామాలకు నీళ్లు, నిధులు రావడం లేదని తెలిపారు. 95 పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు.  స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.

అవకాశవాదం కోసమే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ హరి పార్టీ మారారని, కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందని, న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కాబట్టి పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముందని వివరించారు. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వేధిస్తోందని, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు మాయమయ్యాయని ఎండగట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందని, ఆడబిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు బుద్ధిచెబతారని అన్నారు. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని, ఫీజు రియింబర్స్ మెంట్ చేయకుండా విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అన్నారు. రైతు భరోసా పేరిట రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదని, కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడుతాని తెలిపారు.

మరోవైపు, జనగామ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత... పెంబర్తిలో హస్తకళాకారుల సొసైటీ సభ్యులను కలిసి వారి సమస్యలను, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలిఘటించారు. ప్రముఖ మహమ్మాయి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. స్థానిక మహిళలతో కవిత ముచ్చటించారు.

పెంబర్తి గ్రామంలో బస్ స్టాప్ ని తొలగించినట్లు స్థానికులు తన దృష్టికి తీసుకురాగా... వెంటనే ఆ గ్రామంలో బస్ స్టాప్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వన్నా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అలాగే, పెంబర్తి హస్తకళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారు తయారు చేసే ఉత్పుత్తులకు తగిన ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.

ఓ దొంగ బస్సు అని పెట్టిండు..మా పెంబర్తిలో బస్సే ఆగదు  - పెంబర్తి గ్రామ మహిళ

దసరాకు ఒక జాకీటు ముక్క కూడా ఇవ్వలేదు...కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే - తమ గోసను ఎమ్మెల్సీ కవితకు మొరపెట్టుకున్న పెంబర్తి గ్రామ మహిళ

Tags

More News...

Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...
Local News 

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.  సిటీలోని వివిధ ప్రాంతాల  నుంచి బస్సులు, వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఇక్కడున్న మెయిన్​ రోడ్డు మద్యలోని మెట్రో డివైడర్ ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఎదురుగా అవతల వైపు...
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు   ఎస్ ఈ సాలియా నాయక్    జగిత్యాల మార్చి11( ప్రజా మంటలు) రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు అందులో భాగంగా జగిత్యాల డివిజన్ పరిధిలోని టౌన్ 1 సెక్షన్  లో వీక్లీ బజార్ స్కూల్ ఏరియా లోని  SS-234/100 కె.వి.ఏ నియంత్రిక సామర్థ్యంని...
Read More...
Local News 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష. 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.     జగిత్యాల మార్చి 11(ప్రజా మంటలు)జిల్లాలో  మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర గణిత శాస్త్రము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రము మరియు ఒకేషనల్ పరీక్షలలో 8021 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7771 మంది విద్యార్థులు హాజరైనారు 250 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు పరీక్షల కన్వీనర్ బి. నారాయణ తెలిపారు. మొత్తం 96. 9 శాతం...
Read More...
Local News 

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్..

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్.. మెటుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చి 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మెట్ పల్లి,ఇబ్రహింపట్నం మండలాల పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ...
Read More...
Local News 

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి    జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) రూరల్ మం ధరూర్ గ్రామంలో   శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులపాటు జరిగినాయి.ఈ సందర్భంగా సోమవారం  ఏకకుండాత్మక హవనము, కళాన్యాస హోమము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ,ప్రాణ ప్రతిష్టాపన ,నేత్రోన్మీలనము, దృష్టి
Read More...
Local News 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 11( ప్రజా మంటలు)భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత బాణులను  వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగంగా నిలుస్తుందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి  చేతులమీదుగా  పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను...
Read More...
Local News 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్     జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా  కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు ప్రజామంటలు మార్చి 10 భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ కడారి ప్రభాస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు, గ్రూప్ 1,2,3 లతోపాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ...
Read More...
Local News 

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.  సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.   సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.    బుడగ జంగాల కాలనీలో ఘనంగా గాయత్రి మహాయజ్ఞం.  జగిత్యాల. మార్చి 10(ప్రజా మంటలు) హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడ బుడగ జంగాల ది అని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జగిత్యాల సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సోమవారం బేడ...
Read More...