అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సీఎంకు పేదల పట్ల ఆలోచన లేదు - కేసీఆర్ పదేళ్లలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించారు
15 నెలలు... ₹ 1,50,000,00,00,000 అప్పు - లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా ఆడపిల్లలకు ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదు
అప్పు తెచ్చి కూడా ఒక్క మహిళకూ 2500 ఇవ్వడం లేదు
అప్పులు, ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదారాబాద్ మార్చ్ 10:
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు రూ. లక్షా 52 వేలకుపైగా అప్పులు చేసిందని ఎండగట్టారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పనీ చేయలేదని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం నాడు తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ.... తెలంగాణ గొప్పగా, ఉన్నతంగా ఉందంటూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పదేళ్లలో కేసీఆర్ చాటిచెప్పి పెట్టుబడులను ఆహ్వానిస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేదని అబద్దాలు చెబుతున్నారని, ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమని మండిపడ్డారు. దాంతో దేశంలో ఉన్న అన్ని పత్రికలు కూడా తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉందని రాశాయని, ఇది బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల రేవంత్ రెడ్డికి గౌరవం లేదని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కనీసం రూ 500 కోట్లు కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడానికి (మూలధన వ్యయం) ఖర్చు చేయలేకపోతున్నామని, రాష్ట్రానికి రూ 5500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం రావడం లేదని అని అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రానికి నెలకు రూ 18 వేల కోట్లు వస్తున్నాయని, రూ 6 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, దాదాపు రూ 12 వేల కోట్లు రాష్ట్రానికి మిగులుతున్నాయని వెల్లడించారు. సగటున దాదాపు రూ 3 వేల కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాలు ముఖ్యమంత్రికి తెలియదా లేక అవగాహన లేదా..? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.
హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రికి సామాజిక స్పృహ, దృక్పథం లేదని, హామీలు అమలు చేయాలన్న నియ్యత్ లేదని, భవిష్యత్తు పట్ల దూరదృష్టి లేదు పేదల కడుపునింపాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. 15 నెలల్లో పేదలకు ఒక్క మంచి పనీ చేయలేదని, కానీ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం నిరంతరం కొనసాగుతుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత పెద్దవాళ్లపై ఉందని, పేద వాళ్లపై లేదని విమర్శించారు.
2023 నవంబరు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసిందని, అంటే సగటున నెలకు రూ 10 వేల కోట్లు అప్పు తెస్తున్నారని, మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ 2500 ఇవ్వడం లేదు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకం సంపూర్ణంగా అమలు కాలేదు, వరికి బోనస్ బోగస్ అయింది.. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని నిలదీశారు.
కాగా, “కేసీఆర్ లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని బద్నాం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతీ పైసాకు లెక్క చెప్తాం. మరి లక్షా 50 వేల కోట్ల అప్పుకు లెక్క చెప్తారా ? పదేళ్లలో కేసీఆర్ కేవలం 4 లక్షల 30 వేల కోట్లు అప్పు తెచ్చారు. కానీ అంతకు రెట్టింపు అభివృద్ధి చేశారు.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ 90 వేల కోట్లు ఖర్చు చేశారు, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ లక్షా 35 వేల కోట్లు , మిషన్ భగీరథకు - 37 వేల కోట్లు, రుణమాఫీకి - రూ 30 వేల కోట్లు, ఉచిత విద్యుత్తుకు - 36 వేల కోట్లు, రైతు బంధుకు - 73 వేల కోట్లు , రైతు బీమాకు - 6800 కోట్లు, విద్యుత్తు రంగంపై - రూ లక్షా 38 వేల కోట్లు, ఆరోగ్య రంగంపై - 61 వేల కోట్లు, సంక్షేమ రంగంపై రూ - 2 లక్షల 83 వేల కోట్లు ఖర్చు చేశారు. అప్పు 4 లక్షల కోట్లు అయితే.. సృష్టించిన సంపద 50 లక్షల కోట్లు.” అని వ్యాఖ్యానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
