ధర్మపురి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
( రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494)
దక్షిణ కాశీగా, నవ నారసింహ క్షేత్రాలలో ఉత్కృష్ట మైనదిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రైమూర్త్య నిలయంగా గోదావరి తీరాన వెలసియున్న తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో 10-03-2025 నుండి 22-03-2025 వరకు 13 రోజుల పాటు జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారల వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్, ఆదేశములు, సూచనలను పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పర్యవేక్షణలో బ్రహ్మోత్సవముల సందర్భముగా దేవాలయము లోపల వెలుపల, అన్ని వసతి అవసరమైన చోట్ల రంగులు/సున్నాలు వేయించడం జరిగింది.
భక్తుల సౌకర్యార్థం దేవాలయము లోపల వెలుపల ప్రత్యేక క్యూలైన్స్, కౌంటర్లు ఏర్పాట్లు చేశారు.దాతల సహకారంతో దేవాలయం లోపల ఆవరణలో నీడ కోసం రేకుల షెడ్లు, కూర్చోవడానికి వీలుగా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది.
భక్తుల సౌకర్యార్థం దేవాలయము లోపల, వెలుపల, గోదావరి నది తీరములో తడుకలతో చలువ పందిర్లు, స్త్రీలు బట్టలు మార్చు కోవడానికి వీలుగా ప్రస్తుతము గల శాశ్వత డ్రెస్స్ చెంజింగ్ రూమ్స్ తో పాటు ఆధనముగా తడుకలతో డ్రెస్సింగ్ రూములు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
బ్రహ్మోత్సవాలు విస్తృత ప్రచారం నిమిత్తం పూర్వపు ఉమ్మడి జిల్లాలు అయిన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పాటు మహారాష్ట్రలోని నాం దేడ్ జిల్లాలకు వాల్ పాస్టర్లు, కరపత్రములు మరియు ప్రధాన రహదారులలో జాతర ఫ్లెక్సిలు, దేవాలయ మునకు, గోదావరి నదికి సూచించే సైన్ బోర్డులను, ఫ్లెక్సి బ్యానర్లు ఏర్పాటు చేసి భక్తులకు తెలియ పర్చుటకు చర్యలు గైకొనబడు తున్నవి.
రెండు రాజగోపురములకు, దేవాలయ ములకు, ఆర్చిలకు అదనముగా విద్యుత్ దీపాలం కరణ, లైటింగ్ బోర్డులు, లైటింగ్ వేయించడానికి చర్యలు తీసు కుంటున్నారు. గతములో కంటే ఈ సంవత్సరము అదన ముగా పూల అలంకరణ, ప్రధాన దేవాలయములతో పాటు అనుబం ద ఆలయములకు అలంకరణ, కళ్యాణోత్సవ వేదిక ప్రత్యేక అలంకరణ, బ్రహ్మ పుష్కరిణి, ఇతర అవసర మైన ప్రదేశములలో అలంకరణ చేయడానికి చర్యలు గైకొన బడుచున్నవి.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానము పక్షాన, స్వచ్ఛంద సంస్థలు మరియు దాతల సహాకారంతో దేవాలయం - లోపల, వెలుపల, గోదావరినది తీరములో, ఇతర చోట్ల మంచి నీటి చలివేంద్రముల ఏర్పాటు చేయుటతో పాటు, బ్రహ్మోత్స వముల సందర్భముగా క్షేత్రానికి విచ్చేయు భక్తులకు స్థానిక ప్రజాప్రతి నిధులు, ఆర్యవైశ్య, వర్తక సంఘం, రైస్మిల్లర్స్, దాతలు, స్వచ్చంద సంస్థలు, గ్రామస్తుల సహాకారంలో ఉచిత అన్నదానం చేయడానికి చర్యలు గైకొన బడుచున్నవి. .
భక్తుల సౌకర్యార్ధం ఈ సంవత్సరం లడ్డు ప్రసాదం అధికంగా పులిహోర ప్రసారం తయారు చేయించి భక్తులకు విక్రయిం చడానికి వీలు కల్పిస్తున్నారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ ద్వారా స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గార్లతో జాతర ఏర్పాట్లను ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యము వాటిల్ల కుండా తక్షణ చర్యలు గైకొనుటకు సమన్వయంతో జాతరను నిర్వి ఘ్నముగా జరుపుకొనుటకు చర్యలు గైకొనబడుతున్నవి.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
