అనుమతులు లేని కార్పొరేట్ శ్రీ చైతన్య పాఠశాలలను మూసివేయాలి
యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్
హనుమకొండ మార్చి 8 (ప్రజామంటలు) :
యుఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద అనుమతి లేని కార్పోరేట్ శ్రీ చైతన్య పాఠశాలలపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని నిరసన, ఆందోళన చేయడం జరిగింది.
*ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ* జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా పేద విద్యార్థుల దగ్గర నుండి విచ్చలవిడిగా ఫీజులు దోపిడి చేస్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అదేవిధంగా కార్పొరేటు శ్రీ చైతన్య పాఠశాలకు నక్కల గుట్ట పరిధిలో సెంచరీ స్కూల్ పేరుతో అనుమతి ఉంటే శ్రీ చైతన్యగా మార్చుకొని విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు మండిపడ్డారు. మార్చి నెలలో జరిగే పదవ తరగతి బోర్డు పరీక్షలను శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులకు ఏ స్కూలు పేరా పరీక్షలు నిర్వహిస్తున్నారు తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలపాలని అన్నారు ఇదే విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసిన కేవలం జిల్లా విద్యాధికారి షోకాజు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు ఒకపక్క అనుమతి లేదని తెలిసినప్పటికీ మరొకపక్క శ్రీ చైతన్య కార్పొరేట్ యాజమాన్యం వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల దగ్గర నుండి విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా జిల్లాలో ఉన్న పలు కార్పొరేట్ స్కూల్ లపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ రాకేష్ అరుణ్ మూర్తి రోహిత్ ప్రవీణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
