ఇందిరా మహిళా శక్తి మహిళలకు వరం..
-సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్. -సిటీజేన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. -26 మంది విశిష్ట మహిళలకు పురస్కారాలు.
జగిత్యాల మార్చి 08:
తెలంగాణ రాష్ట్రం లో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం మహిళలకు వరంలా కార్యక్రమాలను చేపట్టడం హర్షనీయమని, అలాగే మహిళలకు పూర్తి భద్రత కల్పించేలా చట్టాలను మార్చాలని,మగవారితో సమానంగా ప్రతి అవకాశం మహిళకు దక్కేలా చూడాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
శనివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రావణి సాంస్కృతిక సంస్థ సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విశిష్ట న్యాయవాదులు పి.లావణ్య,డి.రమ్యకృష్ణలను,మహిళా సంఘాల నేతలు కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ,బైరి రాధలను,సోషల్ వర్కర్ జే.సుమలతను,అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి,శారద,నాగమణి,రెవెన్యూ ఉద్యోగిని రాణి తోపాటు 26 మంది వివిధ రంగాలకు చెందిన విశిష్ట మహిళలను మహిళా రత్న పురస్కారాల్తో హరి ఆశోక్ కుమార్,రిటైర్డ్ తహశీల్దార్ పి.హన్మంత్ రెడ్డి,వ్యవసాయ అధికారి డి.విఠల్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ 2025 ఏడాది ఆక్సీలరేట్ ఆక్షన్ అనే ఓ కొత్త థీమ్ తో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.
న్యాయ వాదులు లావణ్య,రమ్యకృష్ణ లు వివిధ మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి,శ్రావణి సంస్థ అధ్యక్షుడు దిండిగాల విఠల్,బీ.సీ.మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ,సీనియర్ సిటీజేన్స్ జగిత్యాల మండల అధ్యక్షురాలు బైరి రాధ,న్యాయవాదులు పి.లావణ్య,దారం రమ్యకృష్ణ, నక్క ఇంద్రయ్య,యాకూబ్ హుస్సేన్, రెవెన్యూ,మహిళా శిశు సంక్షేమ పెన్షనర్స్, సీనియర్ సిటీజేన్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
