జబల్పూర్ నుంచి వచ్చిన ఏడు డెడ్ బాడీలు - గాంధీ మార్చురీ వద్ద కుటుంబ సభ్యులకు అప్పగింత
జబల్పూర్ నుంచి వచ్చిన ఏడు డెడ్ బాడీలు - గాంధీ మార్చురీ వద్ద కుటుంబ సభ్యులకు అప్పగింత
సికింద్రాబాద్ ఫిబ్రవరి 12 (ప్రజామంటలు) :
మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న నగరానికి చెందిన ఏడుగురు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. జబల్ పూర్ లో పోస్టుమార్టం నిర్వహించి, వారి మృతదేహాలను రెండు అంబులెన్స్ లల్లో బుధవారం గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు తీసుకుని వచ్చారు.
ఉప్పల్ తహసీల్దార్ వాణి రెడ్డి ఆధ్వర్యంలో డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు చూపించి, నిర్దారించుకొని పోలీసులు మృతుల కుటుంబాలకు ఆయా మృతదేహాలను అప్పగించారు. మృతులకు సంబందించిన బ్యాగులు, ఇతర సామాగ్రిని కూడ జబల్ పూర్ నుంచి అంబులెన్స్ లో తీసుకువచ్చి, ఇక్కడి వారి ఫ్యామిలీ మెంబర్స్‌కు అప్పగించారు.
చనిపోయిన తమ వారి సామాగ్రిని చూసిన వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోధనలతో గాంధీ మార్చురీ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ ఉచిత పార్థీవదేహ వాహనంలో డెడ్ బాడీలను వారి స్వగృహాలకు తరలించారు. అందులో నాచారంకు చెందిన శశికాంత్ (38), మల్లారెడ్డి (60), సంతోష్ కుమార్ (47), రవికుమార్ (60), బాలరాజు (31), తార్నాక కు చెందిన ప్రసాద్ (54), సైదాబాద్ కు చెందిన ఆనంద్ కుమార్ (47) ఉన్నారు.
వీహెచ్ సంతాపం :
మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు బుధవారం గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడం దురదృష్టకరమని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
