యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
ఓ పీ ఎస్ ను పునరుద్ధరించాలి -టి ఎస్ సి పి ఎస్ ఈ యు
ధర్మపురి ఫిబ్రవరి 10:
ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోతున్న ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) విధానం కు వ్యతిరేకంగా మార్చ్ 2 వ తేదీన ధర్నా చౌక్ ,హైదరాబాద్ లో జరిగే యూ పి ఎస్ పై యుద్ధభేరి ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ కోరారు.
ధర్మపురి పట్టణం లో గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ
సీపీఎస్ వద్దంటూ పాత పెన్షన్ కొరకు రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ద కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ పేరుతో ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని దీనివల్ల ఉద్యోగుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయనీ ఆందోళన వ్యక్తం చేశారు యూపీఎస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనీ ఇది యూనిపైడ్ పెన్షన్ స్కీం కాదని యూస్ లెస్ పెన్షన్ స్కీం అని విమర్శించారు.
ఉద్యోగి దాచుకున్న డబ్బుల నుండే పెన్షన్ ఇవ్వడం అంటే ఉద్యోగి తనకు హక్కుగా రావాల్సిన పెన్షన్ ను డబ్బులతో కొనుకోలు చేసినట్లు అవుతుందని వెంటనే ఏలాంటి చందా చెల్లించకుండానే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి 50% పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని కోరారు తెలంగాణలో వచ్చేనెల రెండున హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో యూ పి ఎస్ పై యుద్ధభేరికి రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల సి పి ఎస్ ఉద్యోగ ఉపాద్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
