కోర్టు విధులను బహిష్కరించిన మెట్టుపల్లి న్యాయవాదులు
కోర్టు విధులను బహిష్కరించిన మెట్టుపల్లి న్యాయవాదులు
మెట్టుపల్లి ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ హత్యాయత్నం కేసులో నేరస్తుడు రంగారెడ్డి జిల్లా మహిళా న్యాయమూర్తి పై చెప్పు విసిరిన ఘటనపై ఈరోజు కోర్టు విధులను బహిష్కరించినట్లు మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి తెలిపారు, కరణ్ సింగ్ అనే నిందితుడు ఓ వ్యక్తిపై తల్వార్ తో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన ఘటనలు రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు హరీష మేడం గారు యావజీవ కారాగారశిక్ష విధించడం జరిగింది, మరో హత్య కేసులో పోలీసులు జైల్లో ఉన్నటువంటి కరణ్ సింగ్ నిందితున్ని కోర్టులో హాజరుపరచగా అకస్మాత్తుగా చెప్పు విసురగా ఆ చెప్పు జడ్జికి తగలకుండా పక్కనే పడిపోయింది,
వెంటనే నిందితుడు కోపంతో నాకే యావ జీవ కారాగార శిక్ష వేస్తారా అంటూ దుర్భాషలాడం మొదలుపెట్టాడు, దాంతో మరో కేసులో మూడవ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట నిందితున్ని హాజరు పరచగా అతను అక్కడ న్యాయవాదులను కూడా దూషించడం జరిగింది, కరణ్ సింగ్ పై వెంటనే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని మెట్పల్లి న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది,
ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించినట్లు తెలంగాణ ఫెడరేషన్ న్యాయవాదుల సంఘం అధికార ప్రతినిధి పుప్పాల లింబాద్రి తెలిపారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు కే శ్రీనివాస్, వెంకటస్వామి, రాజ్ మహమ్మద్, ఉజ్జల శ్రీనివాస్, యుద్ధ వీర్ అలాల సత్యనారాయణ, భానుమూర్తి, మధుసూదన్ రెడ్డి, శేఖర్, జగన్, సుధాకర్, గంగాధర్, రాజారెడ్డి, శ్రీనివాస్, వెంకటేష్, రామ్ రెడ్డి, ప్రవీణ్, సుదర్శన్, నర్సా గౌడ్, అశోక్, మహిళా న్యాయవాదులు స్రవంతి, మానస, కావేరి, శ్రీలేఖ, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
