లోక కళ్యాణార్థం హరిహరాలయంలో రామకోటి పుస్తక ఆవిష్కరణ
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణములోని బ్రాహ్మణ వీధిలో గల ప్రాచీన హరిహరాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా లోక కళ్యాణార్థం భక్తులు అనునిత్యం మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముల వారి నామస్మరణ చేస్తూ రామకోటి రాయడానికి పుస్తకాలను ఆదివారం భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.
హరిహరాలయంలో శ్రీ సీతారాముల పరివార విగ్రహాలు సాలగ్రామ శిలచే దశావతారాలు విగ్రహాల చుట్టూ ఉండడమే కాకుండా రామలక్ష్మణ విగ్రహాలు కోర మీసాలు కలిగి ఉండడం ఓ ప్రత్యేకత .అంతేకాకుండా పరమశివుడు నర్మదా బాణం శిలచే రూపుదిద్దుకొని భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నర్మదా కంకర్ బోలా శివశంకర్ అన్న నానుడిలా ప్రతినిత్యం భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నర్మదా బాణ రూపుడైన సాంబశివుని అభిషేకించడం ఆలయంలో అనునిత్యం జరిగే క్రతువు. ఇలాంటి మహిమాన్వితమైన ఆలయంలో రామకోటి పుస్తకాలను ఉంచి ఆలయానికి విచ్చేసిన భక్తులు తమ శక్త్యానుసారం రామకోటి రాసి భక్తి భావాన్ని చాటుకోవడానికి ఆలయంలో పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ రామకోటి యజ్ఞక్రతువు ఒక సంవత్సరం లోపు పూర్తి చేయగలమని భక్తులు సంకల్పం చేశారు. ఈ యజ్ఞ సంకల్పాన్ని బుడి అరుణ్ శర్మ భక్తులచే చేయించారు. ఈ కార్యక్రమంలో సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ, నూతనంగా ఆలయ కమిటీ పదవి బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు చాకుంట వేణు మాధవరావు, మరియు కమిటీ సభ్యులు ,ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత
.jpg)
శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం

జిల్లా నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తున్నారు..

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి

ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర
