బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ఇవ్వాలి . - *ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ
కాంగ్రెస్ బాబు జగ్జీవన్ రామ్ ని అవమానపరిచింది
- *ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ.
సికింద్రాబాద్, ఏప్రిల్ 05 (ప్రజామంటలు):
భారత దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ఇవ్వకుండా అవమానించిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ ఆయన మాట్లాడుతూదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే హరిత విప్లవానికి నాంది పలికి ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆహారోత్పత్తి పెంచి ప్రజలకు అన్నం పెట్టిన చరిత్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ కి ఉందని అన్నారు.అలాంటి మహనీయుడిని ఇప్పటికైనా భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించి గౌరవించాలని అన్నారు.బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ నాయకులు నందరం సీతారాం మాదిగ, చెండేటి వేణుగోపాల్ మాదిగ, తుమ్మల శివప్రసాద్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

సభ సక్సెస్ అయ్యేనా ??

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం

లోక కళ్యాణార్థం హరిహరాలయంలో రామకోటి పుస్తక ఆవిష్కరణ
.jpg)
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు.
