ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల ఏప్రిల్ 4 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య తో పాటు కమిషన్ సభ్యులను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి మాట్లాడారు.
కమిషన్ చైర్మన్ వెంకటయ్య, సభ్యులకు వినతి పత్రం సమర్పించి, పలు అంశాలను కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.
అన్ని వర్గాల ప్రజలకు విద్యానందించాలనే సంకల్పంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్న విద్య హక్కును యూపీఏ హయాంలో చైర్ పర్సన్ సోనియా గాంధీ సారద్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2009లో విద్యాహక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి, విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు కేటాయించి, అమలు చేసేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు.
భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్లు బీసీలకు 25% మైనార్టీలకు నాలుగు శాతం ఎస్సీలకు 15% ఎస్టిలకు 10% సీట్లు జనాభా ప్రాతిపదికన ప్రైవేట్ పాఠశాలలో సీట్లు కేటాయించాలని, నిరుపేదలకు విద్యను మరింత చేరువ చేయాలని కోరారు.
ఫీజు రెగ్యులేషన్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల్లోని మౌలిక వసతులు బోధన సౌకర్యాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్ధారించే ఫీజుల వివరాలను జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఏయే పాఠశాలల్లో ఏ మేరకు ఫీజు నిర్ణయించారో విద్యా సంవత్సరానికి ప్రారంభంలోనే ప్రకటించాలని, తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలో తెలుసుకొనే స్వేచ్ఛపూరిత వాతావరణాన్ని కల్పించాలని ఆయన విన్నవించారు.
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నిరుపేద దళితులకు తమ హక్కుల సాధనలో న్యాయం జరగడం లేదని జీవన్ రెడ్డి వాపోయారు.
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దళిత యువతి కంటే సునీత నూతన జిల్లాల ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన విద్యాభ్యాసం కొనసాగించిందని, అనంతరం ఐఈఆర్పి రాత పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించినప్పటికీ నాన్ లోకల్ అంటూ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సైతం సునీతకు ఉద్యోగం ఇవ్వాలని తీర్పు చెప్పినప్పటికీ కూడా నేటికీ హైకోర్టు ఉత్తర్వులు సైతం అమలుకు నోచుకోలేదు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులను కోరారు.
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వీఆర్ఏ ఎన్నికల విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హై కోర్టు ను ఆశ్రయించగా, అర్హతకు అనుగుణంగా ఏదైన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోర్టు సూచించగా, వీ ఆర్ఏ వ్యవస్థ రద్దు అయిందంటూ ప్రభుత్వం సమాధానం ఇవ్వడం తో అన్ని అర్హతలు ఉండి కూడా దళితుడికి న్యాయం జరగకపోవడం బాధాకరమని అన్నారు. ఈ రెండు అంశాలను పరిశీలించాలని కమిషన్ చైర్మన్, సభ్యులకు జీవన్ రెడ్డి విన్నవించగా, జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చిన రెండు అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి, సమస్య పరిష్కరించి, న్యాయం చేస్తామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు.
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్ల కేటాయింపు చేయడంతో పాటు అమలు చేసే విధంగా, భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించిన రిజర్వేషన్ల కు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు చేపట్టేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్

అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి.. వారి అభ్యున్నతి కి కృషి చేయాలి తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000 రూపాయల జరిమాన * బాదితుడికి 1,00,000 రూపాయల పరిహారం

టిపిసిసి సేవాదళ్ సెక్రటరీగా బోగోజి ముఖేష్ కన్నా

గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన

ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాజకీయ దురంహాంకారంతో కేటీఆర్ బెదిరింపులు - ఏఐసీసీ మెంటర్ డా.కోట నీలిమ

బీబీకే ఆధ్వర్యంలో శిల్పాదీదీ పోస్టర్ ఆవిష్కరణ

చెట్లను నరికి ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు.. పర్యావరణ హణనానికి పాల్పడుతున్నారు - ఎమ్మెల్సీ కవిత

బిసి బిల్లుకై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషిని అభినందించిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
