అఖిల భారతీయ రాష్ట్రీయ సాహిక్షక్ మహా సంఘo, జీవ శాస్త్ర విభాగ , జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతి ఉత్సవాలు
కరీంనగర్ మార్చి6(ప్రజా మంటలు)
శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి జీవశాస్త్ర విభాగాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లోకమాత దేవి అహల్యాబాయ్ వోల్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ అహల్యాబాయ్ హోల్కర్ సేవ త్యాగము భక్తి పరాక్రమాన్ని గురించి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా విచ్చేసిన తెలుగు విభాగ సహ ఆచార్యులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి కీలకోపన్యాసం చేస్తూ మహారాణి అహల్యా బాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు. ఒక స్త్రీ పాలనా బాధ్యతలు చేపట్టడంపట్ల రఘోబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతరమం చెప్పినప్పటికీ, నాటి పీష్వా మాధవ రావు అండతో ఆమె ఇండోర్ పాలనా బాధ్యతలు చేపట్టారు. యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు. కాలువలు, చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృధ్ధికి పాటుపడ్డారు. పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, ఘృష్ణేశ్వర్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుద్ధరించింది.ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేసింది. మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చింది. ఈనాటికీ మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ధి.భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుక్కోవేల శ్రీనివాస్, జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి డాక్టర్ కిరణ్మయి కామాద్రి, డాక్టర్ రౌతు రాధాకృష్ణ , డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, డాక్టర్ డి కల్పన, డాక్టర్ బి రవీందర్రావు, డాక్టర్ కందుకూరి కళాజ్యోతి, కళాశాల స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మల్లారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ అసంపల్లి స్వరూప రాణి, డాక్టర్ మహమ్మద్ తాజుద్దీన్, డాక్టర్ దాస్యపు రమ్య, డాక్టర్ ఇటికాల సమత, డాక్టర్ తోట ప్రీతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఖాoపెళ్లి అర్జున్, డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ వి రాజేశం, డాక్టర్ రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ పడాల తిరుపతి తదితర అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొని అహల్యబాయ్ యొక్క సేవలను కొనియాడారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
