బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా

On
బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా


జగిత్యాల మార్చి 28(ప్రజా మంటలు)
-జిల్లా సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో బీఆరెస్ పాత్ర కీలకం.

మేనిఫెస్టో హామీలు అమలు చేసే వరకు ఉద్యమిస్తాము.

జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ 
 బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆరెస్ పార్టీ కార్యాలయం లో బీఆరెస్  సీనియర్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా వసంత  మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆరెస్ పార్టీ ప్రజా గొంతుకగా, ప్రజల పక్షాన  సభలో ప్రభుత్వంను నిలాదీశారన్నారు. పోరాట పటిమ కలిగిన పార్టీ బీఆరెస్ కాబట్టే అధికారం ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని గుర్తు చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు కేటీఆర్, హరీష్ లు ప్రభుత్వ వైఫల్యలపై ప్రశ్నలతో ముచ్చమాటలు పట్టిస్తే, మండలిలో బీఆరెస్ ప్రజాప్రతినిధులు కవితక్క ఆధ్వర్యంలో వినూత్న రీతిలో హామీలపై ప్రదర్శనలు చేస్తూనే, హామీల అమలుపై ప్రశ్నించి ప్రభుత్వం ను ఉక్కిరిబిక్కిరి చేశారన్నారు. అధికార పక్షం, ప్రతి పక్షం అంటే ఏంటో, అది ఎలా ఉండాలో ఎం పని చెయ్యాలో చేసి చూపిస్తున్న ఘనత బీఆరెస్ పార్టీదేన్నారు.

నీళ్లు లేక ఎండిన పొలాలు, అకాల వర్షాలతో నష్టపోయినా పంటలు, ప్రకటించిన గ్యారంటీలు, ఇచ్చిన హామీల అమలుల అంశంలో వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంను నీలదీయడం తో పాటు, పసుపు, మిర్చి పంటలకు మద్దతు ధర, నష్టపోయినా రైతులకు రూ. 25 వేలు, మహిళలలకు ఇస్తామన్నా మహాలక్ష్మి పథకం, స్కూటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ సీఎం  కేసీఆర్  హయాంలో అమలు చేసినవే తప్ప, కొత్త పథకాలు ప్రారంభించదని నిండు సభలో ఒప్పుకున్నారన్నారు.

కాళేశ్వరం పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, పెండింగ్ రియాంబర్స్ విషయం లో కూడా బీఆరెస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన విషయాన్నీ గుర్తు చేశారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ మారిన ఎమ్మెల్యే అసెంబ్లీ లో ఎక్కడ కనిపించలేదని ఆఖరికి ఆయన  మాట కూడా వినిపించిన దాఖలాలు లేవన్నారు. గ్రోక్ సంస్థ సర్వే లో సీఎం కేసీఆర్  ఉత్తమ సీఎం గా పేరు రావడం శుభపరిణామం అన్నారు. జగిత్యాల జిల్లాలో సమస్యలపై ఎమ్మెల్సీ లు కవితక్క, ఎల్ రమణన్నలు బీర్పూర్ మండలంలోని రోళ్ళావాగు ప్రాజెక్టు కు షటర్ లు బిగించాలని, కొండగట్టు అంజన్న అభివృద్ధి కి నిధులు కేటాయించాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ , ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, రైతు సమన్వయ సమితి బాధ్యులు అల్లాల దామోదర్ రావు, వెంకటేశ్వర్ రావు, నాయకులు రిజ్వాన్, గంగిపెల్లి వేణు, గాజుల శ్రీనివాస్, గంగిపెల్లి శేఖర్, కోటగిరి మోహన్, అజుమ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

State News 

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 30 మార్చి (ప్రజా మంటలు) :  నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం మరియు శక్తిపీఠం గణపతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి...
Read More...
Local News 

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి ఢిల్లీ మార్చి 30(ప్రజా మంటలు)  తిమ్మంచర్ల గుంతకల్ ఎఫ్సిఐ గోడెన్ లో చాలా కాలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యపు ధాన్య నిలువల్ని తరలించి గోడన్ నీ ఖాళీ చేసి, మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గోడన్లని వాడుకునే విధంగా అనుమతి ఇప్పించగలరని కేంద్ర ఆహార భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో  పంచాంగ శ్రవణం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో    పంచాంగ శ్రవణం     గొల్లపల్లి మార్చి 30( ప్రజా మంటలు):    ఉగాది పండుగ పురస్కరించుకొని , జాగీతయాలలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో చిలుక ముక్కు నాగరాజు శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.     ఉదయం సత్సంగము అనంతరము, స్వామి సూర్య నారాయణ పల్లకి సేవ తదనంతరము ఉగాది పచ్చడి వితరణ  తరువాత దేవాలయము మహిళా కమిటి సభ్యులు మాత మణుల...
Read More...
Local News 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక     జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)వెలమ సంక్షేమ మండలి ఆద్వర్యం లో శ్రీ *విశ్వావసు నామ ఉగాది పంచాంగ శ్రవణం* ఆదివారం   సంఘం భవనంలో నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా సంజయ్ కుమార్  రాధిక .ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు రామచందర్ రావు, సంఘం అధ్యక్షులు అయిల్నేని...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                             

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                                  ఘనంగా స్వామివారి రథోత్సవం,    -స్వామి వారికి రథం ను బహుకరించిన మామిడి చిన్నయ్య పటేల్ వారసులు,      ఇబ్రహీంపట్నం మార్చి 30(ప్రజా మంటలు దగ్గుల అశోక్జ):    గిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఉగాది జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
State News  Spiritual  

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం - గాయత్రి సత్రంలో పండిత సన్మానం     (రామ కిష్టయ్య సంగన భట్ల...     9440595494)    ఉగాది పర్వ దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి చెందిన లబ్ద ప్రతిష్టులైన పండితులు సన్మానాలు సత్కారాలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా...
Read More...
Local News 

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్, ఇబ్రహీంపట్నం  మార్చి 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ),జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలోని పురాతనాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎంపీ నిధులు రూపాయలు 1,50,000 తో ఏర్పాటుచేసిన హైమస్ లైట్ లను ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షుడు బాయిల్ లింగారెడ్డి ఆదివారం ప్రారంభించారు. కేంద్ర నిధులతోనే...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.       జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  పట్టణములోని సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విద్యతోపాటు భారత దేశ  సంస్కృతి సాంప్రదాయాలను సైతం బోధించడం అభినందనీయం అని...
Read More...
Local News 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మరియు నంబి వాసుదేవాచార్య కౌశిక  ద్వ జారోహణం గావించి, ఉగాది ప్రాశ స్త్యాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్...
Read More...
Local News 

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి సికింద్రాబాద్​, మార్చి 29 ( ప్రజామంటలు ):    గత 28 రోజులుగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పవిత్ర రంజాన్​ మాస ఈవెంట్లు జరిగాయని, ఇందులో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని పలువురు ముస్టిం కమ్యూనిటీ పెద్దలు ప్రశంసించారు. శనివారం సాయంత్రం వారాసిగూడ జడ్​ఎం బాంకెట్​ హాల్​ లో ఇమామ్స్​, మౌజన్స్, ముస్టిం...
Read More...
Local News 

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లాలో నీ కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు    జిల్లా కలెక్టరేట్ స్టేట్ చాంబర్లోజగిత్యాల...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)  పట్టణములోని దేవి శ్రీ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని,ప్రార్థనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  కుల మత తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి...
Read More...