దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ
జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు )
జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్ లో గత 2009 సంవత్సరంలో స్థానిక రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 22 గుంటల భూమిని కేటాయించింది. కాగా శుక్రవారం ఇట్టి భూమికి కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు రజక సంఘం బాధ్యులు
. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బోరగల్ల దేవరాజ్ ఉపాధ్యక్షులు మతులాపురం హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి శ్రీనివాస్, కోశాధికారి బండపల్లి రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు మర్రిపల్లి రాజగంగారం, జంబుక గంగారం , బోరగల్ల తిరుపతి, మర్రిపల్లి గంగాధర్, బండపల్లి శ్రీనివాస్, గుండారపు రాజేశం, మతులాపురం శ్రీనివాస్, గట్టపెల్లి జ్ఞానేశ్వర్, ప్రచారకులు మర్రిపల్లి లక్ష్మణ్, బోరగల్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బోరగల్ల.దేవరాజ్ మాట్లాడుతూ 2009 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 22 గుంటలు దోబీ ఘాట్ నిర్మాణానికి భూమి కేటాయించిందని టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మోడ్రన్ దోబీ ఘాట్ కొరకు అంచనాలు తయారు చేసిందని కాని ప్రభుత్వం ఎన్నికల్లో మారి పోవడంతో దోబీ ఘాట్ నిర్మాణం ఆగిపోయిందని అన్నారు. భూ ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో తమకు కేటాయించిన భూమికి కాంపౌండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. స్థానిక శాసనసభ్యులు గతంలో తమ సంఘ అభివృద్ధికి ఎన్నో సహకారాలు అందించారని ప్రస్తుత కాంపౌండ్ నిర్మాణానికి సైతం సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
