తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్వహించిన మహిళా దినోత్సవం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
జగిత్యాల మార్చి 6 (ప్రజా మంటలు)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
గురువారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్వహించిన మహిళలతో దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకి సమానమైన హక్కులతోపాటు ప్రత్యేకమైన చట్టాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు.
గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం, వంటి చట్టాల ద్వారా మహిళలు వారి యొక్క హింసల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎన్నో శాఖల ద్వారా వారికి సహకారం అందిస్తుందని తెలియజేయడం జరిగింది.
మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక ,మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లయితే వారికి 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య, న్యాయం, పోలీస్, కౌన్సిలింగ్, షెల్టర్ వంటి సహాయాల్ని అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు, మహిళలు ఆర్థికంగా ముందున్నడంవల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీత దేవి 14, సంవత్సరాలు రాముని వెంట ఒక అడవిలో వనవాసం చేసిందంటే సీత దేవి ఎంత ధైర్యవంతురాలు అయితే ఆ అడవిలో రాముని వెంట ప్రయాణించిందని అన్నారు.
లంక రాజ్యంలో రావణాసురుడు సీత దేవినీ బంధించిన ధైర్య సాహసాలతో ఆలంకలో రాముడు వచ్చి తీసుకెళ్తాడని నమ్మకం తో రాక్షస రాజ్యం లో అంత ధైర్యంగా ఉందని.
ఇప్పటి మహిళలు చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్నారని మరి మీరు కూడా ఏ సమస్య వచ్చిన ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఉండాలని మహిళా ఉద్యోగులకు తెలిపారు. శ్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత డిటిఓ, షఫీయ డి ఏవో , సుజాత, జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యవతి , బీసీ వెల్ఫేర్ అధికారి, సుజాత, కమిటీ చైర్మన్ రచన ఆయా శాఖ అధికారులకు మహిళలు ఉద్యోగులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
