చిన్నారుల వినికిడి లోపాలను మొదట్లోనే గుర్తించాలి..
* వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్.
* 40 మంది చిన్నారులకు హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ
* ఇక నుంచి 5 ఏండ్ల పిల్లల వరకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు...
సికింద్రాబాద్ మార్చి 03 (ప్రజామంటలు) :
చిన్న వయస్సులో ప్రాథమిక దశలో గుర్తిస్తే వినికిడి సమస్యలకు ట్రీట్మెంట్ అందించవచ్చని తెలంగాణ రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. వరల్డ్ హియరింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మీనాక్షి వెంకట్ రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మంది చిన్నారులకు వినికిడి యంత్రాలను (హియరింగ్ ఏయడ్స్) అందజేశారు. సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజ్ ఆలూమ్ని భవనం, సెమినార్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. మానవ శరీరంలో ఏదైనా అవయవం పని చేయనప్పుడే దాని విలువ తెలుస్తుందన్నారు. పుట్టిన చిన్నారి శబ్దం విని దానిని గ్రహించకపోతే మాటలు కూడా రావని అందుకే శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు చికిత్స అందించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్లలో ఆడియోలాజిస్టులను నియమిస్తామని చెప్పారు. ఎం.వి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జివి. సేతురామన్ మాట్లాడుతూ 2013లో సేవలు ప్రారంభించిన తమ ఫౌండేషన్ ఇప్పటివరకు రెండు లక్షల మంది చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహించిందని, 2700 మంది పిల్లలకు దాతల సహకారంతో వినికిడి యంత్రాలను సమకూర్చడం జరిగిందని అన్నారు. పద్మారావు నగర్ లోని తమ సిటీ సెంటర్ లో పిల్లలకు వారి తల్లులకు స్పీచ్ తెరపీ పై శిక్షణ ఇస్తున్నామని, వినికిడి సమస్యలు ఉన్న పిల్లలను సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని తమ ఫౌండేషన్ లక్ష్యమని ఆయన అన్నారు.
ఇక నుంచి ఐదేండ్ల పిల్లల వరకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ:
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మూడేళ్ల లోపు ఉన్న చిన్నారులకు దాదాపు రూ ఆరున్నర లక్షల విలువ చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఉచితంగా చేస్తున్నామని, కాని గాంధీ ఆసుపత్రి ఈఎన్టీ హెచ్ఓడీ డా.భూపేందర్ సింగ్ రాథోడ్ చేసిన విజ్ఞప్తి మేరకు దానిని త్వరలో ఐదేళ్ల వయసు వరకు పొడిగించనున్నామని ఆయన అన్నారు. అలాగే కేవలం ఒకటే చెవికి మాత్రమే ఉన్న పథకాన్ని రెండు చెవులకు కూడా చికిత్స చేసేందుకు త్వరలో అనుమతి విడుదల చేస్తామని చెప్పారు. కోఠి లోని ఈ ఎన్ టి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల కోసం పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆదేశిస్తామని ఆయన అన్నారు. గాంధీ ఆసుపత్రిలో కూడా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి అవసరమైన మెడికల్ ఎక్విప్ మెంట్ ను అందిస్తామని తెలిపారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ రాజకుమారి, ఈ ఎన్ టి విభాగం హెచ్ఓడి డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, డోనర్ ఆదినారాయణ, ఎంవి ఫౌండేషన్ ట్రస్టీ వసంత సేతురామన్, డైరెక్టర్ డాక్టర్ రంగనాథన్, మురళి నటరాజన్, ప్రసాదరావు,సిబ్బంది పాల్గొన్నారు. తమ పిల్లలకు వినికిడి శక్తి పరీక్షలను నిర్వహించి, ఉచితంగా వినికిడి పరికరాలను అందజేసిన ఎం.వి ఫౌండేషన్ కు వివిధ జిల్లా నుంచి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
