జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)
సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ లోనీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరిండెంట్ ,డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ , సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్పాడ్, అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణ పై అదనపు కలెక్టర్ బి.ఎస్ లత తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహణకు జిల్లాలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 28, పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ గాని స్మార్ట్ వాచ్ లు అనుమతి లేదని అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో శానిటేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రతి పరీక్ష కేంద్రాలో సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో ఫ్యాన్స్ లైటింగ్ వంటి ఏర్పాటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ,సంబంధిత ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
