మల్క కొమురయ్య గెలుపు నవ శకానికి నాంది తపస్
జగిత్యాల మార్చ్ 4 (ప్రజా మంటలు)
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో మల్కా కొమురయ్య గెలుపొందడం నవ శకానికి నాంది లాంటి దని తపస్ జిల్లా అధ్యక్షుడు బొ్నగిరి దేవయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాద్ రావులు అన్నారు. తపస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య విజయం సాధించగా తపస్ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల తాసిల్ చౌరస్తా వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించుకుని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవయ్య మాట్లాడుతూ గతంలో తపస్ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీతో అంటగాగి ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసారని విమర్శించారు. గత ఆరేళ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఉపాధ్యాయ లోకం ఆక్రోశంతో,ఆవేదనతో ఉందని, వారి ఆక్రోశాన్ని ఓట్ల రూపంలో వేసి మల్కా కొమురయ్య ను భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. జాతీయ వాదానికి మద్దతు పలికి కొమురయ్య గెలుపుకు సహకరించిన ప్రతి ఉపాధ్యాయునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నల రాజశేఖర్ రాష్ట్ర బాధ్యులు ఎలిగేటి రాజేంద్రప్రసాద్ గడ్డం మైపాల్ రెడ్డి చెరుకు మహేశ్వర శర్మ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
