నేరాల నియంత్రణలో, నిందితులను పట్టుకోవడంలో జాగిలాల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల మార్చి 5( ప్రజా మంటలు)
నేర నిరోధక చర్యల్లో జిల్లా పోలీస్ జాగిలాల పనితీరు ప్రశంసనీయం: జిల్లా ఎస్ పి అశోక్ కుమార్
పోలీస్ జగిలాలు (Police Dogs) నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ, మరియు విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని,శిక్షణా సామర్థ్యం వల్ల పోలీసులు విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం దగ్గర పోలీస్ జగిలాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... పోలీస్ జాగిలాలకు ఇంతకు ముందు SRSP క్వార్టర్స్ లో ఉండేది అక్కడ సరైన వసతులు లేవని జిల్లా ఎస్పీ తమ యొక్క దృష్టికి తీసుకురావడం జరిగిందని వీటికి శాశ్వతంగా గదులను కేటాయించాలని ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరిగింది అని అన్నారు. జగిలాలు నేరాల నిరోధం, విచారణ మరియు భద్రతాపరమైన చర్యల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటి అధిక సామర్థ్యం, విశ్వసనీయత మరియు ప్రత్యేక శిక్షణ కారణంగా పోలీస్ వారికి ఎంతగానో సహాయపడతాయి అని తెలిపారు.
ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ.. విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు. మాదకద్రవ్యాలు (Drugs), బాంబులు (Explosives), మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ, మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల కోసం గదులను ఏర్పాటుకు సహాయం చేసిన జిల్లా కలెక్టర్ కి ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్ ను సాధించిన డాగ్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి మెడల్ ను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బీమ్ రావు,డిఎస్పి లు రఘు చంధర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్,DCRB ,SB, finger prints ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ఆరిఫ్ అలీ ఖాన్, శ్రీధర్, మరియు RSI లు, డాగ్స్ హాండ్లర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
