ఆధార్ కార్డు లేక చిన్నారిని తిప్పి పంపిన స్కూల్ నిర్వాహకులు
తిరిగి ఈ రోజు అదే స్కూల్ లో చిన్నారిని చేర్పించిన కాంగ్రెస్ ఇంచార్జీ నీలిమ
సికింద్రాబాద్ మార్చి 06 (ప్రజామంటలు) :
అనివార్య కారణాలతో చదువును మద్యలో ఆపేసిన కూలీ పనులు చేసుకునే వారి కూతురు ను తిరిగి స్కూల్ లో చేర్పించి సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డా.కోట నీలిమ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు ఇవి..సనత్ నగర్ దాసారం బస్తీకి చెందిన చిన్నారి మల్లెల శ్రీవిద్య (8) తల్లిదండ్రులు అశోక్, మమత కూలీ పనులు చేస్తుంటారు. వీరు తమ కూతురును గత ఏడాది స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో చేర్పించారు. అయితే పాప శ్రీవిద్య కు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేనందున స్కూల్ కు పంపవద్దంటూ స్కూల్ నిర్వాహకులు చిన్నారి శ్రీవిద్య పేరును తొలగించారు. దాంతో అప్పటి నుంచి పాప చెత్తా, చెదారంలో దొరికే కాగితాలను తీసుకొని, వాటి ఆధారంగా పేపర్లపై రాసుకుంటూ, చదువుకోడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డా.కోట నీలిమ స్థానిక నాయకులతో కలసి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను కలిశారు. పాప ఆధార్ కార్డు లేదనే కారణంతో స్కూల్ నుంచి తిప్పి పంపారనే విషయాన్ని కోట నీలిమ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో మాట్లాడారు. చైర్మన్ స్థానిక విద్యాశాఖాధికారులకు ఇచ్చిన ఆదేశాలతో కోట నీలిమా గురువారం చిన్నారి శ్రీవిద్యను తిరిగి అదే ప్రైవేట్ స్కూల్ లో చేర్పించారు. తమ పాపకు తిరిగి స్కూల్లో చేర్పించిన కాంగ్రెస్ నాయకురాలు డా.కోట నీలిమకు చిన్నారి తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
