అర్హులైన ప్రతి పేదవారికి కొత్త రేషన్ కార్డులను అందిస్తాం
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 04:
అర్హులైన ప్రతి పేదవారికి కొత్త రేషన్ కార్డులను త్వరితగతిన అందజేసే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ చౌరస్తాలోని రేషన్ డీలరు షాపు నం.1 వద్ద డీలర్ {సయ్యద్ అలీ (నవాబ్)} ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ లత తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.
అనంతరం లక్ష్మణ్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ధర్మపురి మండలంలో 39 రేషన్ షాపులకు గాను 18వేల 5వందల 35 తెల్ల రేషన్ కార్డులు ఉండగా, 52వేల 7వందల 96 మంది లబ్ధిదారులకు 3వేల 3వందల 25.57 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందనీ, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నా మని, అర్హులైన ప్రతి పేదవారికి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరితగతిన అందజేసే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలకులు దరఖాస్తు చేసుకున్న పేదవారికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారా వారి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలని, పేద ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేసే ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని, సన్న బియ్యాన్ని తీసుకుంటున్న ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నామని, పేద వారికి పంపిణీ చేసే సన్న బియ్యం విషయంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, అదే విధంగా రేషన్ డీలర్లు కూడా 5వేల రూపాయల గౌరవ వేతనం, బియ్యం సరఫరాలో తరుగు, హమాలీ ఖర్చులు వంటి కొన్ని సమస్యలను తమ దృష్టికి రాకుండా చూసుకోవాలని సూచించారు. డీలర్ల సమస్యలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బుగ్గారం పట్టణ నూతన ముస్లిం కమిటీ ఏకగ్రీవం

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు

శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్

అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి.. వారి అభ్యున్నతి కి కృషి చేయాలి తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000 రూపాయల జరిమాన * బాదితుడికి 1,00,000 రూపాయల పరిహారం

టిపిసిసి సేవాదళ్ సెక్రటరీగా బోగోజి ముఖేష్ కన్నా

గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన

ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాజకీయ దురంహాంకారంతో కేటీఆర్ బెదిరింపులు - ఏఐసీసీ మెంటర్ డా.కోట నీలిమ

బీబీకే ఆధ్వర్యంలో శిల్పాదీదీ పోస్టర్ ఆవిష్కరణ
