పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..
*సెల్లార్లలోకి వర్షపునీరు..మునిగిన బైకులు..
*చెరువుల్లాగా మారిన రోడ్లు
*ఇండ్లల్లోకి చేరిన వాన నీరు
*వెంకటాపురం కాలనీలో కూలిన ప్రహరీ
సికింద్రాబాద్ ఏప్రిల్ 03 (ప్రజామంటలు):
సిటీలో మద్యాహ్నం కురిసిన అకాల వర్షానికి అంతా అతలాకుతలం అయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావునగర్ వెంకటపురం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న తుంగభద్ర మహిళా మండలి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆరు నెలల క్రితం గుంతలు తవ్వి వదిలేశారు. పనులు ఇంకా మొదలు కాలేదు. గురువారం కురిసిన వానకు కాలనీకి చెందిన వరద నీరు మొత్తం ఈ కమ్యూనిటీ హాలు స్థలంలో నిండిపోయి , ప్రహరీ గోడ కుప్పకూలింది. దాంతో వరద నీరు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి వెళ్లడంతో నిత్యవసర వస్తువులన్నీ పాడైపోయాయి. అన్ని గదుల్లో నీళ్లు వెళ్ళడంతో బకెట్లతో నీళ్లు బయట పారబోశారు. మున్సిపల్ అధికారులు సకాలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఉంటే ఈరోజు తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని వెంకటాపురం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
పలు అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి నీరు చేరడంతో బైకులు నీట మునిగాయి, పంపులు సాయంతో సెల్లార్ లోని వాన నీటిని బయటకు పంపింగ్ చేశారు. బౌద్దనగర్ డివిజన్ లో అకాల వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎల్ ఎన్ ఆర్ నగర్ లో రోడ్లు నీట మునగగా, ఇండ్లల్లోకి నీరు వచ్చాయని స్థానికులు వాపోయారు. బన్సీలాల్ పేట సేవా సంఘం కమ్యూనిటీ హాల్ సమీపంలోని డీ క్లాస్ ప్రాంతంలో రోడ్లు జలమయం అయి, ఇండ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు నీట మునిగాయి. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులకై ఎంపీ అరవింద్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తో కలసి కేంద్ర పట్టణ అభివృద్ధి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి కి ఎమ్మెల్యే సంజయ్ నిధుల మంజూరికై వినతి

పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం..... అదనపు కలెక్టర్ బి. ఎస్ లత.

నల్ల మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది,

మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత

పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..

జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి, నాగరికత ప్రదర్శన...

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ

దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులు

కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య
