"ఆకాశమే హద్దుగా” జగిత్యాల మానస హై స్కూల్ వార్షికోత్సవం సందడి
జగిత్యాల ఎప్రిల్ 04:
పట్టణంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి వార్షికోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచిపోయింది. “VIBRANCE - 2025 ఆకాశమే హద్దుగా” అన్న నినాదంతో నిర్వహించిన ఈ వేడుక పద్మనాయక కళ్యాణ మండపం, కరీంనగర్ రోడ్, జగిత్యాలలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీమతి జోగినపల్లి మంజుల రమాదేవి రవీందర్ రావు, పాఠశాల డైరెక్టర్ లు శ్రీధర్ రావు ,హరిచరణ్ రావు ,సుమన్ రావు,మౌనిక రావు ప్రిన్సిపాల్ రజిత రావు లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం మొదటి నుండి చివరి వరకూ పండుగలా సాగింది. విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్‌లు, పాటలు, నాటికలు – అన్నీ ఆహ్లాదాన్ని పంచాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారివరకు స్టేజ్ మీద చేసిన ప్రదర్శనలు చూసి ప్రేక్షకులంతా హర్షించారు.
వేదిక నిండా రంగురంగుల వెలుగులు, పిల్లల ఉత్సాహం, తల్లిదండ్రుల చప్పట్లు… అన్నీ కలసి ఒక పండగ వాతావరణంను తీసుకొచ్చాయి. చాలా కాలం తరువాత పిల్లల కళను చూసిన తల్లిదండ్రులు ఆనందం తో ఉప్పొంగిపోయారు. “ఈ తరం పిల్లలు చదువు పక్కనే అన్ని రంగాల్లోనూ ముందుండగలరన్న నమ్మకాన్ని మానస స్కూల్ ఇచ్చింది,” అని తల్లిదండ్రులు అభినందించడం పాఠశాల నిబద్ధతకు నిదర్శనం.
పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రావు గారు మాట్లాడుతూ – “పిల్లల ప్రతిభను మెరుగుపర్చే అవకాశం ఇలాంటివే. వారు కలల్ని చూడాలి, వాటిని నెరవేర్చే దారిలో మేము తోడుగా ఉండాలి – ఇదే మా మానస స్కూల్ లక్ష్యం,” అన్నారు.
ఈ ఏడాది వార్షికోత్సవం ఒక వినోదం కాదు – ఒక స్ఫూర్తి, ఒక ప్రయాణం! అన్నట్టుగా నిలిచిపోయిందనీ,
వాస్తవంగా చెప్పాలంటే… మానస స్కూల్ చూపించిన దిశ – “ఆకాశమే హద్దుగా!” అని నిరూపించిందని పాఠశాల డైరెక్టర్ లు కొనియాడారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్

అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి.. వారి అభ్యున్నతి కి కృషి చేయాలి తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000 రూపాయల జరిమాన * బాదితుడికి 1,00,000 రూపాయల పరిహారం

టిపిసిసి సేవాదళ్ సెక్రటరీగా బోగోజి ముఖేష్ కన్నా

గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన

ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాజకీయ దురంహాంకారంతో కేటీఆర్ బెదిరింపులు - ఏఐసీసీ మెంటర్ డా.కోట నీలిమ

బీబీకే ఆధ్వర్యంలో శిల్పాదీదీ పోస్టర్ ఆవిష్కరణ

చెట్లను నరికి ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు.. పర్యావరణ హణనానికి పాల్పడుతున్నారు - ఎమ్మెల్సీ కవిత

బిసి బిల్లుకై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషిని అభినందించిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
