సదా స్మరణీయం... గుండి శంకర్ సేవా భావం

పదవీ విరమణ సభలో వక్తల అభిభాషణం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 05:
47ఏళ్ల ఉపాధ్యాయ జీవితంలో తెలుగు పండితులు గుండి శంకర్ చేసిన బహుముఖ సేవలు సదా స్మరణీయాలు అని పలువురు వక్తలు వక్కాణించారు.
ధర్మపురి నియోజక వర్గ కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన గుండి శంకర్ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన మహోత్సవానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ... విద్యార్థి నేతగా, ఉపాధ్యాయ సంఘం బాధ్యునిగా, భాషా పండితునిగా, కార్యక్రమాల నిర్వాహకులుగా, దాతగా, భోజన ఏర్పాట్ల నిపుణులుగా, జట్టు నాయకునిగా, ఆదర్శ మార్గ దర్శిగా, సామాజిక సేవా తత్పరులుగా అందించిన బహుముఖ సేవలను గుర్తు చేశారు.
ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ ప్రసంగాలలో... ప్రస్తుత విద్యా వ్యవస్థ, విద్యార్థుల దురవస్తల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ, సమూల మార్పు ఆవశ్యకతను వివరించారు. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలన్నారు. గుండి శంకర్ దంపతులను శాలువా, పూలమా లతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్ అధ్యక్షతన, ఉపాధ్యాయులు దేహగాం గణేశ్ నిర్వహించిన బహిరంగ సభలో, కరీంనగర్ డి సి ఎం ఎస్ చైర్మన్ ఎల్లలా శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంగన బట్ల దినేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రామయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంగ
నర్సింహులు, సీనియర్ పాత్రికేయులు జే సురేందర్, రిటైర్డ్ ఎస్పీ రమేశ్ బాబు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆనందరావు, యాళ్ళ అమరనాథ్ రెడ్డి, రఘు శంకర్ రెడ్డి, సూద రాజేందర్, నారాయణ రెడ్డి, ఎన్నం రాం రెడ్డి, గాదె శ్రీనివాస్, దహేగం గణేష్, మండల విద్యాధికారులు సీత లక్ష్మీ , భీమయ్య, కిశోర్, వివిధ సంఘాల నేతలు, శంకర్ సతీమణి విజయ లక్ష్మి, కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, శంకర్ స్నేహితులు, హితులు, సన్నిహితులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ సమావేశాలకు వెళ్లిన కోట నీలిమ

ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో చెన్నై బౌలింగ్ను చిత్తు చేశాడు

రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం

చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ

చోరికి వచ్చిన దొంగకు వింత అనుభవం..

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
