సనాతన ధర్మం వైపు పయనించాలి హ డాక్టర్ శిల్పా కళ దీదీ..
గొల్లపల్లి ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
సనాతనం అంటే నిత్య నవీనం, సత్యం, పరోపకారం, త్యాగం, సేవా, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు అని నేటితరం ఆచరించి ధర్మం వైపు పయనించాలని డాక్టర్ శిల్పా కళ దీదీ అన్నారు. మండలంలోని భీంరాజ్ పల్లి గ్రామంలో బీబీకే ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం, శ్రీరాముని ధర్మ ప్రవచనాలపై నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు.
గ్రామంలో ముందుగా శ్రీరాముని శోభయాత్ర, ర్యాలీ అత్యంత వైభవంగా జరిగాయి శోభ యాత్రలో శిల్పా దిది పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.భక్తులు, మహిళల వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోలాటం ఆటలు, హనుమాన్ భక్తుల నృత్యాల నడుమ కన్నుల పండువగ శోభయాత్ర జరిగింది. అనంతరం ప్రవచనాల కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శిల్ప దీదీ మాట్లాడుతూ
ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు అందరూ వేరువేరు రూపాల్లో హైందవం కొలుచుకుంటున్న దైవాలు. కానీ ఉన్నది ఒక్కటే ఏక్ సంతు విప్రా బహుదావదంతి అన్నారు.
మతాలు వేరైనా దైవం ఒకటే అని సనాతనం ధర్మం చెబుతుందన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఇలాంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మమన్నారు. కాలానుగుణంగా సాంప్రదాయాలు, ఆచారాలు మారవచ్చు కానీ ధర్మం మారదు అన్నారు. శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవితమని ఆయన జీవితం ధర్మం, నీతి, మర్యాద,ప్రేమ వంటి గొప్ప విలువలకు నిదర్శనం అన్నారు. ఆయన ఆదర్శాలను అనుసరించడం ద్వారా వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాలలో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అన్నారు . అందుకే శ్రీరాముని ఆదర్శం మానవులకు ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంత చిన్న గ్రామంలో నా చేత కార్యక్రమం నిర్వహించినటువంటి బి బి కే ఫౌండర్ బొమ్మన కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ జెసి కందుకూరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి యువత రాముడు జీవితం ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం మా ఊరిలో బి బి కే ఫౌండర్ కుమార్ నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా భవిష్యత్తులో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్నారు. అనంతరం బీబీకే ఆధ్వర్యంలో శిల్పాకలా దీదీకి ఘన సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బిపికె ట్రస్ట్, ఫౌండర్ అధినేత బొమ్మెన కుమార్,లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ తాడూరు శ్రీనివాస ఆచార్య, హిందు వాహిని టోలి మెంబెర్ వేముల సంతోష్, తిరుపతిరావు,జిల్లా గోరక్షక్ ప్రముఖ్ ఆడెపు నరేష్, భజరంగ్ దళ్ మండల కన్వీనర్ ఎనగందుల రమేష్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కందుకూరి రమాదేవి, ఉపాధ్యాయులు మధుకర్ రెడ్డి, కంది స్వామి, ఎనగందుల రూపేష్, సింగారపు దొంగయ్య లచ్చయ్య, మహేష్, రేవెల్ల సత్తయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
