ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం.రఘువరణ్
జగిత్యాల ఎప్రిల్ 15:
రైతులు తమ ధాన్యన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేసి కనీస మద్దతు ధర పొందాలని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం. రఘువరణ్ తెలిపారు. జగిత్యాల మండలం లోని నర్సింగాపూర్, వెల్దుర్తి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 133 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గన్ని సంచులు కూడా కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుందని, రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు, అలాగే వారికి సంబందించి ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ప్రతులు కేంద్రం లో అందజేసి భూమి వివరాలు సరి చూసుకోవాలని అన్నారు,
ట్యాబ్ లో సీరియల్ టోకెన్ నమోదు చేసుకోవాలని కోరారు. వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు., వంజరిపల్లి, జాబితాపూర్, ధర్మారం గ్రామాల్లో స్థానిక అధికారులచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల యం.పి.డి.ఓ. రమాదేవి,మండల ఎపియం వి. గంగాధర్, సి.సి. మరియా, ప్రజాప్రతినిధులు మహేష్, మల్లారెడ్డి, శేఖర్ రెడ్డి, మల్లేశం. గౌడ్, నరేష్,ప్రవీణ్ గౌడ్, ప్రకాష్, మమత, గ్రామ సమాఖ్య అధ్యక్షురాళ్లు దివ్య, జామున,వి. ఓ. ఏ లు లక్ష్మి, జల, పలువురు రైతులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
