గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
విజయం సాధించిన డా.సుభోద్, డా.రాజేశ్
సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు):
తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన రెండు జనరల్ కౌన్సిల్ మెంబర్ (ఒకటి ప్రొఫెసర్ క్యాడర్, మరొకటి అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ) పోస్టులకు గురువారం గాంధీ ఆసుపత్రిలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగ్గా, సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయింది.
విజేతలుగా డా.సుబోధ్, డా.రాజేశ్:
ప్రొఫెసర్ క్యాడర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టు కోసం డా.సుబోధ్, డా.కృపాల్ సింగ్ లు పోటీపడగా, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా.సుభోద్ విజయం సాధించారు. అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టుకు డా.రాజేశ్,డా.కళ్యాణచక్రవర్తి,డా.కృష్ణానాయక్,డా.లక్ష్మీకాంత్రెడ్డి లు పోటీ పడగా, జనరల్ సర్జరీ డాక్టర్ రాజేశ్ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన డా.ఆవుల మురళీధర్ ప్రకటించారు. గాంధీ టీజీజీడీఏ గాంధీ యూనిట్ ప్రెసిడెంట్ ప్రొ.భూపేందర్ సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగ్గా, సెక్రటరీ డా.అబ్బయ్య, ట్రెజరర్ డా.రవి లు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన డా.సుభోద్, డా.రాజేశ్ లను పలువురు డాక్టర్లు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
