అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ
సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు):
అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ డిపార్ట్ మెంట్ లో ఈ సర్టిఫికెట్ లు పొందవచ్చు. ఇందుకోసం దరఖాస్తు తో పాటు రక్త పరీక్షలు, ఛాతి ఎక్స్ రే, బ్లడ్ గ్రూపు పరీక్షల రిపోర్ట్ లను తీసుకుని రావాలని, 50 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లు మాత్రం తప్పనిసరిగా రెండు మోకాళ్ళ ఎక్స్రేలను తీసుకొని రావాలని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల జారీ కోసం డీఎంఈ పర్యవేక్షణలో డాక్టర్ బి.కిరణ్ (ఆర్థోపెడిక్), డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి (కార్డియాలజీ), డాక్టర్ భానుప్రియ (పల్మానాలజీ), డాక్టర్ కృష్ణ నాయక్ (జనరల్ మెడిసిన్) వైద్యుల బృందం నియమించారని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
