మండలంలో కట్ట మహేష్ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే భౌతిక దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు -బీజేపీ ఆరోపణ
బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు
గొల్లపల్లి ఎప్రిల్ 14 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకుల దాడికి గురైనకట్ట మహేష్ ఇంటినీ పరిశీలించి, పార్టీ కార్యకర్తలను బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కట్ట మహేష్ ఇంటి మీద జరిగిన దాడిని బీజేపీ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మరియు మండల కేంద్రం లో జరుగుతున్న దౌర్జన్యాలను అక్రమాలను ప్రశ్నిస్తూ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న కట్ట మహేష్ మరియు కార్యకర్తలు అయినా కళ్యాణ్,వెంకటేష్ లపైన దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది.అలాగే ఇంట్లో ఆడవాళ్ళను కూడా చూడకుండా చేయి చేసుకోవడం వారి యొక్క ఈర్ష్య, అహంకరాలను ప్రతీక అని అన్నారు.ఇంకోసారి భాజపా నాయకులు,కార్యకర్తల మీద దాడి చేస్తే రాబోవు రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తీవ్రంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు..
ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం, ఓరుగంటి చంద్ర శేఖర్ మర్రిపెల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
