విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...?
గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు
ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి
బుగ్గారం ఏప్రిల్ 18:
గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత ఆరేండ్ల సమస్యకు "పరిష్కారం" లభించింది.
గతంలో ఈ యొక్క పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా "న్యాయం" జరుగలేదని బాధితుని ఆరోపణ.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన పచ్చిమట్ల సత్తన్న గౌడ్ అనే వ్యక్తికి తన కుటుంబ సభ్యులతో పంచాయతీ ఏర్పడ్డది. కాగా గత ఆరు సంవత్సరాల క్రితం కుల సంఘం మండల అధ్యక్షుడు అయిన అప్పటి అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు (తాజా మాజీ ప్రజా ప్రతినిధి భర్త) చట్టానికి విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఈ పంచాయతీని చేతబట్టాడు. ఇరువర్గాల వద్ద రూ.5000 (ఐదు వేల) చొప్పున దడువత్ తీసుకున్నాడు.
గత ఆరేండ్ల నుండి పంచాయతీ తెంపేది లేదు. బాధితుడికి న్యాయం చేసేది లేదు. తీసుకున్న దడువత్ డబ్బులు తిరిగి ఇచ్చేది లేదు. గతంలోనే ఈ పంచాయతీ కాస్త స్థానిక పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లింది. అయినా నేటికీ పరిష్కారంకు నోచుకోలేదు. పంచాయతీ తెగక పోవడంతో విసిగి వేసారిన బాధితుడు తన దడువత్ డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని గత ఆరేండ్ల నుండి సదరు నాయకుని వద్దకు తిరుగుతున్నాడు. ఎంత తిరిగినా.... ఎంత బ్రతిమి లాడినా.... కుల సంఘం జిల్లా పెద్దల వరకు వెళ్ళినా.... సదరు నాయకుడు ససేమిరా అంటూ... కుంటి సాకులతో... ఆ దడువత్ డబ్బులు నేటికీ తిరిగి ఇవ్వడం లేదు. చివరకు మరో రాజకీయ నాయకుడు ఇచ్చిన సలహా మేరకు సదరు బాధితుడు బుగ్గారంలోని "గ్రామ అభివృద్ది కమిటీ" ని సంప్రదించాడు.
బాధితుడు చెప్పిన వివరాలన్ని గ్రహించి సాక్ష్యా దారాలను తెలుసుకొని, పలువురు పంచాయతీ పెద్దలతో మాట్లాడి విడిసి బృందం వాటిని పరిశీలించారు. వెంటనే సంబంధిత కుల సంఘం జిల్లా అధ్యక్షులతో సమస్యను, జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని వివరించారు. వెంటనే మీ కుల సంఘం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిచో బాధితునికి అండగా ఉండి న్యాయ పోరాటం చేయాల్సి ఉంటదని విడిసి బృందం ఆ జిల్లా అధ్యక్షునితో తేల్చి చెప్పింది. విడిసి బృందం అందజేసిన న్యాయమైన సూచనలతో సదరు కుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంటనే స్పందించారు.
కేవలం గంట వ్యవధి లోనే బాధితునికి సదరు రాజకీయ నాయకుడు సుమారు ఆరేండ్ల క్రితం తీసుకున్న దడువత్ రూ.5,000 బాధితుని వద్దకు వచ్చి తిరిగి చెల్లించాడు.
విడిసి కృషి వల్ల పేదవాడినైన నాయొక్క దడువత్ డబ్బులు తిరిగి వచ్చాయని బాధితుడు పచ్చిమట్ల సత్తన్న గౌడ్ హర్షం వ్యక్తం చేసారు.
కాగా ఇలాగే అనేక చోట్ల అక్రమంగా రాజకీయ నాయకులు, పంచాయతీల పెద్ద మనుషులు దడువత్ లు తీసుకుంటూ వేలాదిగానే కాకుండా లక్షల్లో కూడా దోచుకుంటున్నారని విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన ఎండిసి కన్వీనర్ చుక్క గంగారెడ్డి ఆరోపించారు.
అక్రమ దడువత్ లే కాకుండా దావత్ ల పేరుతో లక్షలాది రూపాయలు బాధిత పేద ప్రజల నుండి పంచాయతీ పెద్దలు దోచుకుంటున్నారని ఆయన వివరించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు చిన్న - చిన్న తగాదాలతో లక్షల్లో నష్ట పోతున్నారని తెలిపారు. పంచాయతీ పెద్ద మనుషులు స్వార్థపూరితంగా, రాజకీయంగా, కుట్ర పూరితంగా పంచాయతీ తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. చిన్న - చిన్న తగాదాలను కూడా పెద్దగా సృష్టించడం, ఏండ్ల తరబడి పంచాయతీలు పరిష్కారానికి నోచుకోకుండా చేయడంతో పేద ప్రజలు తీవ్రంగా మోస పోతున్నారని అన్నారు. సంబంధిత అధికారుల పేరుతో కూడా పంచాయతీ పెద్దలు, రాజకీయ నేతలు నేటికీ కూడా భారీ దోపిడీలకు పాల్పడుతున్నారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని బుగ్గారం విడిసి విజ్ఞప్తి చేస్తోందన్నారు. లేకుంటే నిరుపేదలు ఈ పంచాయతీల పేరుతో జరిగే దోపిడీలను, మద్యం - మాంసంతో కూడిన దావత్ (విందు) లను, పంచాయతీ దళారుల చేష్టలను తట్టుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చుక్క గంగారెడ్డి సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
