అంబేద్కర్ భవనాన్ని నిర్మించి, లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తాం - విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 14:
ధర్మపురి పట్టణంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించి, లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని, జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ పని చేశారని, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలకు గాను ఆ మహనీయుడి మరణాంతరం' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనీ గుర్తు చేశారు.
ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయిందని, ధర్మపురిలో అంబేద్కర్ భవనం కావాలని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే అనువైన స్థలాన్ని చూసి 20 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తామని, అందులోనే ఒక లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
