అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.
సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):
మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని బిజెపి బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. బ్రిటిషోళ్ళకే భయపడలేదని బీజేపీకి భయపడం అన్న దయాకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని బ్రిటిషోళ్లు వేసిన భీజమే కాంగ్రెస్ అని తెలుసుకోకపోవడం కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు ఏ.ఓ హ్యూమ్ ఒక బ్రిటిష్ అధికారి అన్న విషయం దయాకర్ కు తెలియక పోవడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.
గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో బీజేపీని ఓడిస్తాం అనగానే సోనియా, రాహుల్ పై ఈడీ దాడులు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని గతంలో సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ మీద మని ల్యాండరింగ్ కేసు వేశారని అప్పటి నుండి దానిమీద ఈడీ విచారణ జరుపుతోందని విచారణలో భాగంగా సోనియా, రాహుల్ ల ప్రమేయం ఉన్నట్టు ఈడీ విచారణలో తేలడం వల్లే సోనియా, రాహుల్ ల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందని ఈడీ అనేది రాజ్యాంగ బద్ధమైన ఒక సంస్థ అని అలాంటప్పుడు మోడీకి అమిత్ షాకి ఏమి సంభందం అని ప్రశ్నించారు.
ఈడీ అనే రాజ్యాంగ బద్ధమైన సంస్థ బిజెపి అధికారంలో వచ్చాకనే రాలేదని రాజ్యాంగం, అంబెడ్కర్ గురించి పదే పదే మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఈడీని అవమానిస్తే రాజ్యాంగాన్ని అంబెడ్కర్ గారిని అవమానించినట్లేనని కాంగ్రెస్ నాయకులు గుర్తెరగాలి అన్నారు.ఒకవేళ ఈకేసులో సోనియా, రాహుల్ ల తప్పు లేకుంటే కోర్టులో తమ సచ్చీలతను నిరూపించుకోవాలి కానీ ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు తెలపడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. దేశమంతా కులగణన చేపట్టాలని పార్లమెంట్ లో రాహుల్ డిమాండ్ చేయడం వల్లనే బిజెపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు అసలు సోనియా, రాహుల్ ఏ కులానికి చెందినవారో గాంధీ కుటుంబానికి సోనియా కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని అన్నారు.
చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు గాంధీ పేరు తగిలించుకొని నకిలీ గాంధీలు తయారు అయ్యారని వారిని దేశప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని అందుకే వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తున్నారని దీన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణచుకోలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎక్కువ కాలం పాలించి స్కాంగ్రెస్ పార్టీగా అవతరించిందని ఏద్దేవా చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
