వృద్ధుల ఫిర్యాదులపై విచారణలు.
జగిత్యాల మార్చి 22:
తమను నిరాదరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కు వివిధ గ్రామాల వృద్ధులు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఆర్డీవో అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏ.ఓ.తఫజుల్ హుస్సేన్ విచారణలు నిర్వహించారు.
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిల్ల నర్సవ్వ,జగిత్యాల పట్టణానికి చెందిన కొప్పు భారతి , ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన దుర్గం బాలమ్మ,సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన సిరికొండ బుచ్చవ్వ,మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన కస్తూరి రాజం, తదితర ,వివిధ గ్రామాల ఫిర్యాదు దారుల కుమారులను,కూతుర్లను,కోడళ్లను,అల్లుళ్ళను , మనుమలను,మనుమ రాళ్లను విచారించారు. విచారణలకు ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారి కుమారులకు,కోడళ్లకు,కూతుర్లకు,అల్లుళ్ళకు 2007 సంరక్షణ చట్టం,నియమావళి 2011 , సెక్షన్ 24 పై సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సిలింగ్ చేశారు.జగిత్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండిగే లక్ష్మీ అనే వృద్ధ తల్లిని,తండ్రి బాలమల్లు ను పోషించకుండా కొడుతూ,చంపుతనని బెదిరింపులకి గురిచేస్తున్న వారి పెద్ద కొడుకు పై జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 24 ప్రకారము ఎఫ్.ఐ.ఆర్.నెంబర్.340/2024 తేదీ.29-7-2024 ద్వారా క్రిమినల్ కేసు నమోదు అయిందని,అలాగే కోరుట్ల డివిజన్ లో ఒక కుమారునికి 6 మాసాల జైలు శిక్షతో పాటు జరిమాన అక్కడి ఆర్డీవో విధించిన విషయాన్ని వివరిస్తూ కౌన్సి లింగ్ నిర్వహించారు. విచారణకు హాజరు కాని వారిపై చట్టపర చర్యలు ఉంటాయని ఏ.ఓ.తఫజుల్ హుస్సేన్ హెచ్చరించారు. .ఈ విచారణలో సీనియర్ సిటిజెన్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఎఫ్.ఆర్.ఓ.కొండయ్య ,వృద్ధుల సంరక్షణ విభాగం సహాయకురాలు పద్మజ ,తదితరులున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
